Jairam Ramesh : మణిపూర్ హింసపై కేంద్ర అఖిలపక్ష సమావేశం కంటితుడుపు చర్య : జైరాం రమేష్

ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, ఇంఫాల్‌లో సమావేశం జరిగి ఉంటే, మణిపూర్ ప్రజల బాధ జాతీయ సమస్యకు సంబంధించిన అంశమని స్పష్టమైన సందేశం వెళ్లి ఉండేదన్నారు.

Jairam Ramesh

All-Party Meeting : మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కేవలం కంటితుడుపు చర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అభివర్ణించారు. మణిపూర్ లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి కాంగ్రెస్ డిమాండ్లు చేసినట్లు తెలిపారు. మణిపూర్‌ హింసపై ప్రధానమంత్రి మోదీ తన మౌనాన్ని వీడాలని సూచించారు. ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, ఇంఫాల్‌లో సమావేశం జరిగి ఉంటే, మణిపూర్ ప్రజల బాధ జాతీయ సమస్యకు సంబంధించిన అంశమని స్పష్టమైన సందేశం వెళ్లి ఉండేదన్నారు.

మణిపూర్‌లోని అన్ని మిలిటెంట్ గ్రూపుల నుండి వెంటనే ఆయుధాలను లాక్కోవాలని తెలిపారు. మణిపూర్ ముఖ్యమంత్రిని వెంటనే మార్చాలని సూచించారు. మణిపూర్ లో ఏ చర్య తీసుకున్నా అది రాజ్యాంగానికి లోబడి ఉండాలని వెల్లడించారు. అందరి ఫిర్యాదులను విని సున్నితత్వంతో ఏకాభిప్రాయం సాధించాలని పేర్కొన్నారు.

Siddaramaiah Video: వాస్తు దోషం అంటూ మూసేసిన తలుపులు తెరిచి అందులో నుంచే వెళ్లిన సీఎం సిద్ధరామయ్య

జాతీయ రహదారులు రెండింటినీ ఎల్లప్పుడూ తెరిచి, సురక్షితంగా ఉంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల లభ్యతను నిర్ధారించాలని తెలిపారు. బాధిత ప్రజలకు ఉపశమనం, పునరావాసం, జీవనోపాధికి సంబంధించిన ప్యాకేజీని ఆలస్యం చేయకుండా సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే ప్రకటించిన సహాయ ప్యాకేజీ సరిపోదని తెలిపారు.