Jammu And Kashmir : స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు అమర జవాన్ల పేర్లు

జమ్మూకశ్మీర్ లోని స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు ఉగ్రవాదంపై పోరులో అమరులైన సైనికులు, గాలంట్రీ అవార్డులు అందుకొన్న మిలటరీ సిబ్బంది మరియు

Jammu And Kashmir జమ్మూకశ్మీర్ లోని స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు ఉగ్రవాదంపై పోరులో అమరులైన సైనికులు, గాలంట్రీ అవార్డులు అందుకొన్న మిలటరీ సిబ్బంది మరియు ,కళాకారుల పేర్లు పెట్టబోతున్నారు.

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సమావేశంలో…దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న క్రమంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమరుల త్యాగాలను గుర్తించి, గౌరవించే లక్ష్యంతో పాఠశాలలు, రోడ్లు, భవనాలకు అమర సైనికులు, ప్రముఖుల పేర్లు పెట్టాలనే నిర్ణయానికి ఆమోదం లభించినట్లు గురువారం జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం తెలిపింది.

ఇప్పటికే జమ్మూకశ్మీర్ పాలనాయంత్రాంగం…108 మంది పేర్లతో ఓ లిస్ట్ ను తయారు చేసింది. ఈ జాబితాలో ఎక్కువగా భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది పేర్లు ఉన్నాయని, సాహిత్య అకాడమీ అవార్డులు పొందినవారి పేర్లు కూడా ఉన్నాయి. వీరందరూ జమ్మూకశ్మీర్ కు చెందినవారే.

ALSO READ Rakesh Tikait : టిక్రీ,ఘాజిపూర్ సరిహద్దుల్లో బారికేడ్ల తొలగింపు..పార్లమెంట్ కి రైతులు

ట్రెండింగ్ వార్తలు