Rakesh Tikait : టిక్రీ,ఘాజిపూర్ సరిహద్దుల్లో బారికేడ్ల తొలగింపు..పార్లమెంట్ కి రైతులు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నట్లు

Rakesh Tikait : టిక్రీ,ఘాజిపూర్ సరిహద్దుల్లో బారికేడ్ల తొలగింపు..పార్లమెంట్ కి రైతులు

Del

Rakesh Tikait కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నట్లు శుక్రవారం ఢిల్లీ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి నుండే టిక్రీ, ఘాజిపూర్‌ సరిహద్దుల్లో ఏర్పాట్లు చేసిన బారికేడ్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో దాదాపు ఏడాది తర్వాత ఈ రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారి 9లోని సెక్టార్​ 2, 3 వద్ద ఉన్న బారికేడ్లను తొలగించామని.. త్వరలోనే ఎన్​హెచ్​ 24ను కూడా అందుబాటులోకి తెస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇక, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న రైతులను నగరంలోకి రానివ్వకుండా మేకలను కొట్టి, కాంక్రీటుతో బారికేడ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని కూడా జేసీబీ మిషన్లతో తొలగిస్తున్నారు.

కాగా,అయితే సరిహద్దుల్లో ట్రాఫిక్‌ అంతరాయంపై నూతన వ్యవసాయ చట్టాలపై విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు రైతులను ప్రశ్నించింది. సరిహద్దుల్లో తమ ఆందోళనల వల్ల కాకుండా పోలీసుల చర్యల వల్లే ట్రాఫిక్‌ సమస్య నెలకొందని అన్నదాతలు కోర్టుకు విన్నవించారు. దీంతో పోలీసులపై మండిపడ్డ కోర్టు ట్రాఫిక్‌కు ఎలా అంతరాయం కల్గిస్తారంటూ ప్రశ్నించింది. వాటిని తొలగించాలని పేర్కొన్న విషయం విదితమే.

ALSO READ Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..