Hiroshi Suzuki Viral Video: ‘బాబోయ్ నా భార్య కారంతో చంపేస్తోంది’, ఇండియన్ ఫుడ్‭పై జపాన్ అంబాసిడర్ ట్వీట్.. ప్రధాని మోదీ ఏమన్నారో తెలుసా?

చాలా వీడియోల్లో తన భార్య తనకు కారం తినిపిస్తూ చంపేస్తోందంటూ కొంటెగా చెప్పుకొచ్చారు. తాను మాత్రం స్పైసీ లేని ఫుడ్ ఆర్డర్ చేస్తే.. తన భార్య మాత్రం కావాలని స్పైసీగా ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి తనకు తినిపిస్తోందంటూ నెటిజెన్లతో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు

Japanese ambassador: విదేశీ అతిథులు ఇండియాకు వచ్చినప్పుడల్లా ఇక్కడి ఆహారాన్ని రుచి చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. కొందరు దీన్ని భిన్న రీతుల్లో వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వీడియోలు నెట్టింట్లో తరుచూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి వీడియోలో నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. తన భార్యతో కలిసి పూణె, కొల్హాపూర్ వీధుల్లో ఇండియన్ ఫుడ్ తింటున్న వీడియోలో సుజుకి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తున్నారు.

Sushi Terrorism: కప్పులు ఎంగిలి చేస్తూ రెస్టారెంట్‭లో పాడు పని.. జపాన్ యువకుడికి గట్టిగానే పడింది పిడి

అయితే చాలా వీడియోల్లో తన భార్య తనకు కారం తినిపిస్తూ చంపేస్తోందంటూ కొంటెగా చెప్పుకొచ్చారు. తాను మాత్రం స్పైసీ లేని ఫుడ్ ఆర్డర్ చేస్తే.. తన భార్య మాత్రం కావాలని స్పైసీగా ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి తనకు తినిపిస్తోందంటూ నెటిజెన్లతో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సుజుకి షేర్ చేసిన ఈ వీడియోలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. భారత పాకశాస్త్ర వైవిద్యాన్ని ఆస్వాదిండచం చాలా ఆనందాన్ని కలిగించిందని, దాన్ని వీడియోల రూపంలో ఇలా కొనసాగించాలని సూచించారు.

Rajasthan Politics: సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? అనుమానాలకు తావిస్తున్న తండ్రి వర్ధంతి సందేశం

హిరోషి సుజుకి పూణే వీధుల్లో వడ పావ్, మిసల్ పావ్ వంటి ప్రసిద్ధ మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించారు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ ఫుడ్ తింటున్న సమయంలో హిరోషి సుజుకి స్పందన చూడవలసిందే. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ వీడియోలో హిరోషి వడ పావ్ రుచి చూస్తూ స్పైసీగా ఉందని చెప్పడం, ఆ సమయంలో ఆయన ముఖంలో కలిగే హావభావాలను చూడొచ్చు. ఇక అదే వీడియోలో, ఆయన భార్య ఇంకా ‘నాకు మరింత స్పైసీగా తీసుకురండి’ అంటూ ఆర్డర్ ఇవ్వడం చూడొచ్చు. ఇలాంటి భిన్న సందర్భాల్ని ఒక వీడియోగా రూపొందించి ‘నా భార్య నన్ను కారంతో చంపేస్తుంది’ అనే అర్థంలో ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ స్పందన
జపాన్ అంబాసిడర్ సుజుకి వైరల్ వీడియోపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఆ వీడియోను కోట్ ట్వీట్ చేస్తూ ‘‘మిస్టర్ అంబాసిడర్, ఓడిపోయినప్పటికీ మీరు బాధపడలేని పోటీ ఇది. మీరు భారతదేశంలోని పాకశాస్త్ర వైవిధ్యాన్ని ఆస్వాదించడం, దానిని ప్రదర్శించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇలాంటి వీడియోలను మాతో పంచుకుంటూ ఉండండి’’ అని ట్వీట్ చేశారు. సుజుకి ట్వీట్ చేసిన 22 సెకన్ల క్లిప్‌ను ఇప్పటివరకు 8 లక్షలకు పైగా వీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు