Japan Minister In Delhi Metro
Japan Minister Hayashi In Delhi metro : భారత్ రాజధాని ఢిల్లీ(Delhi)లో జపాన్ విదేశాంగ మంత్రి (Japanese Foreign Minister)యోషిమస హయషి (Yoshimasa Hayashi) పర్యటిస్తున్నారు. ఇండియా-జపాన్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి హయషి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో వ్యవస్థ(Delhi Metro system)ను పరీక్షించి సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ నుంచి ఎల్లో లైన్ లోని చావ్రీ బజార్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం పటేల్ చౌక్ మెట్రో మ్యూజియాన్ని (Patel Chowk Metro Museum)సందర్శించారు. మంత్రి వెంట భారత్ లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీ(Hiroshi Suzuki), డీఎంఆర్‌సీ (DMRC) డైరెక్టర్ అమిత్ కుమార్ జైన్(Amit Kumar Jain) , హయషి వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించి ఫోటోలను డీఎంఆర్‌సీ ట్విటర్‌లో షేర్ చేసింది.
ఈ సందర్భంగా మంత్రి హయషి మాట్లాడుతు..ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు ఇండో-జపాన్ సహకారానికి చిహ్నంగా ఉందని..జపాన్ ప్రబుత్వం ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులకు మొదటి నుంచి గణనీయమైన నిధులు సమకూర్చింది అని వెల్లడించారు. అలాగే ప్రాజెక్టు 4కు నిధులు సమకూరుస్తుందని తెలిపారు.
దీనిపై డీఎంఆర్‌సీ డైరెక్టర్ మాట్లాడుతు ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులకు జపాన్ (Japan International Cooperation Agency)మొదటి నుంచి నిధులు సమకూర్చిందని… మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తోందని వెల్లడించారు.
కాగా..రెండు రోజుల పర్యటనకు జపాన్ విదేశాంగ మంత్రి గురువారం (జులై27,2023) ఇండియాకు వచ్చారు. దీంట్లో భాగంగా శుక్రవారం ‘ఇండియా-జపాన్ ఫోరమ్’సదస్సులో ప్రసంగించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు విడదీయలేని భాగస్వామి అని అన్నారు.