Javed Akhtar Tweet
Javed Akhtar Tweet : ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ తెలియని వారుండరు. ఆయన తరుచుగా ట్విట్టర్‌లో యాక్టివ్ ఉంటారు. ప్రస్తుత సమస్యలపైనా.. తన పని, అప్ డేట్లను షేర్ చేసుకుంటారు. అయితే తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ కాస్త ఆసక్తికరంగా మారింది.
జావేద్ అక్తర్ తాజాగా పెట్టిన ట్వీట్ చూసి నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. తన ట్విట్టర్ ఖాతాలో (@Javedakhtarjadu) ‘పీ’ అని హిందీలో ఒకే ఒక్క లెటర్‌తో ట్వీట్ చేశారు. ఇక ఆయన ట్వీట్‌కి టిండర్ ఇండియా ‘క్యూ’ (queue) అని రిప్లై ఇచ్చింది. ఇక స్విగ్గీ ‘ఖా'(తినడం) హిందీలో ఒకే లెటర్ జావేద్ ట్వీట్‌కి జవాబు ఇచ్చింది. ఇలా ఆయన పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఇక ఇద్దరు వ్యక్తులు ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘పీ రహే హై జావేద్ సాహెబ్’ అని క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేశారు.
ఇంతకీ జావేద్ నెటిజన్ల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయా? అని ట్వీట్ చేశారో.. నిజంగానే ఆయన ట్వీట్ చేసిన సింగిల్ అక్షరం ‘పీ’ వెనుక నిగూఢంగా ఏదైనా రహస్యం దాగి ఉందో.. ఆయనే చెప్పాలి ఇక. ప్రస్తుతానికి ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
पी
— Javed Akhtar (@Javedakhtarjadu) July 13, 2023