Javed Akhtar: ముంబై దాడుల సూత్రధారులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. పాకిస్తాన్‌లోనే విమర్శించిన జావేద్ అక్తర్

తాజాగా పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించారు బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్. 26/11 ముంబై దాడుల సూత్రధారులు పాకిస్తాన్‌లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన ఆ దేశంలోనే విమర్శించారు. ప్రముఖ కవి ఫయాజ్ అహ్మద్ ఫయజ్ స్మారకార్థం పాకిస్తాన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో జావెద్ అక్తర్ పాల్గొన్నారు.

Javed Akhtar: ముంబై దాడుల సూత్రధారులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. పాకిస్తాన్‌లోనే విమర్శించిన జావేద్ అక్తర్

Javed Akhtar: ముంబై దాడుల్లో పాకిస్తాన్ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో తాజాగా పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించారు బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్. 26/11 ముంబై దాడుల సూత్రధారులు పాకిస్తాన్‌లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన ఆ దేశంలోనే విమర్శించారు.

Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి

ప్రముఖ కవి ఫయాజ్ అహ్మద్ ఫయజ్ స్మారకార్థం పాకిస్తాన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో జావెద్ అక్తర్ పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో జావెద్ మాట్లాడుతుండగా, జనంలోంచి ఒక వ్యక్తి కలుగజేసుకున్నాడు. ‘‘మీరు ఎన్నోసార్లు పాకిస్తాన్ వచ్చారు. మీరు మీ దేశం (ఇండియా) వెళ్లిన తర్వాత పాకిస్తాన్ ప్రజలు మంచి వాళ్లని, బాంబులు వేసే వాళ్లే కాదు.. పూల దండలతో, ప్రేమను కూడా పంచుతారని చెప్పగలరా?’ అంటూ ప్రశ్నించాడు.

Kotamreddy Sridhar Reddy: ‘నిరసన గొంతుక’ పేరుతో సమస్యలపై పోరాటం సాగిస్తా.. జాతర విషయంలో కాకాణి, అనిల్, ఆదాల కలిసి రావాలి ..

దీనికి జావెద్ అక్తర్ స్పందిస్తూ ‘‘ఈ విషయంలో ఒకరినొకరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. దీని వల్ల సమస్యలు పరిష్కారం కావు. పరిస్థితులు చక్కబడాలి. నేను ముంబైకి చెందిన వాడిని. అక్కడ ముంబైపై దాడుల్ని (26/11) చూసిన వాడిని. ఆ దాడులు చేసిన వాళ్లు ఏ నార్వేలోనో.. ఈజిప్టులోనో లేరు. ఆ నిందితులు స్వేచ్ఛగా ఇంకా పాకిస్తాన్‌లోనే తిరుగుతున్నారు. ఈ విషయంలో భారతీయులు చేసే ఆరోపణలకు మీరు బాధపడాల్సిన, ఖండించాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

అలాగే పాకిస్తాన్‌కు చెందిన నుస్రత్ ఫతే అలీ ఖాన్, మెహిదీ హసన్ వంటి కళాకారులు ఇండియాలో తమ సంగీత ప్రదర్శన చేశారని, కానీ, లతా మంగేష్కర్ ఏరోజూ పాక్‌లో పాడలేదని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్‌కు ముంబై దాడుల విషయంలో ఆ దేశంలోనే చురకలంటించిన జావెద్ అక్తర్‌పై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.