Kotamreddy Sridhar Reddy: ‘నిరసన గొంతుక’ పేరుతో సమస్యలపై పోరాటం సాగిస్తా.. జాతర విషయంలో కాకాణి, అనిల్, ఆదాల కలిసి రావాలి ..

నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుగాలమ్మ అమ్మవారికి గ్రామ జాతర నిర్వహిస్తామని ముందే చెప్పానని, అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల రోజులైనా అనుమతి రాలేదని, ఎన్నికల కోడ్ ఉందని ఇవ్వలేమని కమిషనర్ చెబుతున్నారని, ఆథ్యాత్మిక కార్యక్రమాలకు కోడ్ ఏంటో అర్థం కాలేదని శ్రీధర్ అన్నారు.

Kotamreddy Sridhar Reddy: ‘నిరసన గొంతుక’ పేరుతో సమస్యలపై పోరాటం సాగిస్తా.. జాతర విషయంలో కాకాణి, అనిల్, ఆదాల కలిసి రావాలి ..

kotam Reddy

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో వైసీపీలో‌ఉన్న సమయంలో పలు సమస్యలకోసం పోరాడి పరిష్కరించానని, ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉన్నా.. సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఈనెల 25న నెల్లూరు రూరల్ సమస్యల పై ‘నిరసన గొంతుక’ పేరుతో కార్యక్రమాన్ని చేపడతానని కోటంరెడ్డి తెలిపారు.

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో ట్విస్ట్… అసలు విషయం చెప్పిన స్నేహితుడు

నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుగాలమ్మ అమ్మవారికి గ్రామ జాతర నిర్వహిస్తామని ముందే చెప్పానని, అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. అయితే, నెల రోజులైనా అనుమతి రాలేదని, ఎన్నికల కోడ్ ఉందని ఇవ్వలేమని కమిషనర్ చెబుతున్నారని తెలిపారు. ఆథ్యాత్మిక కార్యక్రమాలకు కోడ్ ఏంటో అర్థం కాలేదని, జాతరకు మూగ చాటింపు వేయల్సిన అవసరం ఉందన్నారు. వచ్చేనెల 24 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.

MLA Kotamreddy Gunmen Removal : గన్ మెన్ల తొలగింపుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం

ఈ విషయంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. ఆయన అడిగితే ఒక గంటలో అనుమతి ఇస్తారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీ ఇరుగాలమ్మ అమ్మవారి జాతర  ఆదాల ఆధ్వర్యంలో చేసినా తమకు అభ్యంతరం లేదని, నేను సామాన్య భక్తుడిలా పాల్గొంటానని శ్రీధర్ రెడ్డి అన్నారు. మంత్రి కాకాణి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు కలిసి ఈ కార్యక్రమం చేయాలన్నారు. వారు ముందుకు రాకపోతే పురోహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీధర్ రెడ్డి చెప్పారు.