Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో ట్విస్ట్… అసలు విషయం చెప్పిన స్నేహితుడు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అటు కోటంరెడ్డి, ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆరోపించారు.

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో ట్విస్ట్… అసలు విషయం చెప్పిన స్నేహితుడు

Kotamreddy Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అటు కోటంరెడ్డి, ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆరోపించారు.

Zoom Layoffs: ఉద్యోగాలకు కోత పెడుతున్న జూమ్.. 1300 మందిని తొలగించేందుకు సిద్దం

ఆయన తన స్నేహితుడితో మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ క్లిప్ రికార్డు చేసి, బయటకు వదిలారని కోటంరెడ్డి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని వైసీపీ నేతలు ఖండించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలతోపాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఆరోపణల్ని ఖండించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు. కోటంరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఆడియో క్లిప్.. ఫోన్లో రికార్డ్ చేసిందని, అది ఫోన్ ట్యాపింగ్ కాదని వైసీపీ వాదించింది. ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ బయటపడింది. కోటంరెడ్డి ఫోన్లో మాట్లాడిన స్నేహితుడు రామశివా రెడ్డి మీడియా ముందుకొచ్చారు. కోటంరెడ్డి ఫోన ట్యాపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఆడియో.. ఫోన్ రికార్డింగ్ ద్వారా వచ్చిందన్నారు.

Rajma Chawal Tattoo: చేతిపై రాజ్మా చావల్ టాటూ.. నెటిజన్ల రియాక్షన్ ఏంటో తెలుసా?

‘‘గతంలో నాకు కాంగ్రెస్, వైసీపీతో రాజకీయంగా సంబంధం ఉంది. 30 ఏళ్లుగా రాజశేఖర్ రెడ్డితో నడిచాను. 15 ఏళ్లుగా ఎమ్మెల్యే కోటంరెడ్డితో అనుబంధం ఉంది. రాజకీయాలు వదిలేసి కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నాను. ఆయన జగన్ దగ్గర బీఫామ్ తీసుకుని విజయం సాధిస్తే సంతోషించా. కోటంరెడ్డితో అనేకసార్లు ఫోన్లో మాట్లాడా. మా ఇంటికి కూడా వచ్చేవారు. డిసెంబర్‌లో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఘటన టీవీ ఛానళ్లలో, యూట్యూబ్‌లో చూశా. అదే రోజు రాత్రి 8 గంటలకి నాకు ఎమ్మెల్యే కాల్ చేశారు. రావత్ గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది అని సలహా ఇచ్చాను.

China balloon: చైనా స్పై బెలూన్ నిఘాలో ఇండియా.. మరిన్ని దేశాలు కూడా! అమెరికా నివేదిక ఏం చెప్పిందంటే..

ఒక కాంట్రాక్టర్ విషయంలో సుదీర్ఘంగా నాతో మాట్లాడారు. ఆ కాంట్రాక్టర్ వ్యవహారంలో ఆయనతో మాట్లాడా. నా ఫోన్‌లో కాల్ ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతుంది. ఆ రోజు కూడా అలాగే రికార్డ్ అయ్యింది. నా ఫోన్‌లో ఉన్న కాంట్రాక్టర్ విషయంపై రికార్డింగ్‌ని స్నేహితుల వద్ద యాదృచ్చికంగా వినిపించా. రాష్ట్ర ప్రభుత్వంపై ఇంత ఆరోపణలు వస్తాయని నేను ఊహించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాస్తున్నాను అని ఎమ్మెల్యే చెప్పారు. దీనిపై నాకు ఆందోళన కలిగింది.

చిన్న విషయంపై రాష్ట్రంలో ఇంత ఆందోళన నన్ను కలిచివేసింది. వైఎస్సార్ పై దుష్ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు’’ అని రామశివా రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటివరకు కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై కోటంరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.