Zoom Layoffs: ఉద్యోగాలకు కోత పెడుతున్న జూమ్.. 1300 మందిని తొలగించేందుకు సిద్దం

ఒకదానితర్వాత ఒకటి కంపెనీలు వరుసగా ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఇప్పుడీ జాబితాలో వీడియో కమ్యూనికేషన్ సంస్థ ‘జూమ్’ కూడా చేరింది. కంపెనీలోని ఉద్యోగుల్లో 15 శాతం లేదా 1,300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు జూమ్ ప్రకటించింది.

Zoom Layoffs: ఉద్యోగాలకు కోత పెడుతున్న జూమ్.. 1300 మందిని తొలగించేందుకు సిద్దం

Zoom Layoffs: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఒకదానితర్వాత ఒకటి కంపెనీలు వరుసగా ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఇప్పుడీ జాబితాలో వీడియో కమ్యూనికేషన్ సంస్థ ‘జూమ్’ కూడా చేరింది. కంపెనీలోని ఉద్యోగుల్లో 15 శాతం లేదా 1,300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు జూమ్ ప్రకటించింది.

Google Bard: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా గూగుల్ ‘బార్డ్’.. బ్లాగ్ ద్వారా వెల్లడించిన సుందర్ పిచాయ్

అలాగే మూల వేతనాల్లోనూ కోత విధించనున్నట్లు చెప్పింది. వీడియో కాలింగ్ సర్వీస్‌గా వచ్చిన జూమ్.. లాక్‌డౌన్ టైంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉండటంతో జూమ్ వంటి సంస్థలకు విపరీతమైన ఆదరణ దక్కింది. ఈ సేవల్ని వాడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆర్థిక మాంద్యం, నిర్వహణా వ్యయం పెరగడం వంటి కారణాలు సంస్థకు ఇబ్బందిగా మారాయి. కంపెనీ షేర్లు గత ఏడాది 63 శాతం పడిపోయాయి. మళ్లీ ఇటీవల 9 శాతం పుంజుకున్నాయి. సంస్థ ఆదాయం గత ఏడాది 38 శాతం తగ్గినట్లు అంచనా.

Rajma Chawal Tattoo: చేతిపై రాజ్మా చావల్ టాటూ.. నెటిజన్ల రియాక్షన్ ఏంటో తెలుసా?

కంపెనీలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు జూమ్ సీఈవో ఎరిక్ యువాన్ ప్రకటించారు. అంతేకాదు.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో 98 శాతం వదులుకుంటున్నట్లు కూడా చెప్పాడు. అలాగే ఉద్యోగుల తొలగింపు గురించి 30 నిమిషాల్లో వారి మెయిల్‌కు సమాచారం అందుతుందని చెప్పారు. కంపెనీ తొలగించబోతున్న ఉద్యోగులకు 16 వారాల వేతనం చెల్లిస్తామన్నారు. అంతేకాదు.. ఉద్యోగంలోంచి తీసేసినప్పటికీ ఈ సంవత్సరం హెల్త్ కేర్ కవరేజ్, బోనస్ వంటివి కూడా అందుతాయని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిట్ టీమ్ వేతనంలో 20 శాతం కోత పెడుతున్నట్లు జూమ్ చెప్పింది.