పిల్లలను ప్రలోభపెట్టారు : జయప్రదపై కేసు

ప్రముఖ నటి, రామ్ పూర్ బీజేపీ అభ్యర్థి జయప్రదపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై రెండు పోలీసు కేసులు నమోదు చేశారు. మధురలో ఎన్నికల ప్రచారంలో

  • Publish Date - April 12, 2019 / 04:32 AM IST

ప్రముఖ నటి, రామ్ పూర్ బీజేపీ అభ్యర్థి జయప్రదపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై రెండు పోలీసు కేసులు నమోదు చేశారు. మధురలో ఎన్నికల ప్రచారంలో

ప్రముఖ నటి, రామ్ పూర్ బీజేపీ అభ్యర్థి జయప్రదపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై రెండు పోలీసు కేసులు నమోదు చేశారు. మధురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జయప్రద.. ఓటర్లకు స్వీట్లు, డబ్బు పంపిణీ చేస్తూ కెమెరాకి దొరికిపోయారు. పెద్దవాళ్లకే కాదు చిన్నపిల్లలకు, నెలల వయసున్న పసికందుకు ఆమె డబ్బు ఇచ్చారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Read Also : చెన్నైలో 3.50 కిలోల గోల్డ్ స్వాధీనం

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జయప్రద డబ్బులు పంచారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధమని, దీనిపై వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. జయప్రదపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఈసీ విచారణ జరిపింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు జయప్రదపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రామ్ పూర్ అభ్యర్థిగా జయప్రద పోటీ చేస్తున్నారు.

జయప్రద అనూహ్యంగా ఇటీవలే బీజేపీలో చేరారు. అమర్‌సింగ్‌ సన్నిహితురాలిగా సమాజ్‌వాదీ పార్టీలో ఆమె ఓ వెలుగు వెలిగారు. యూపీలోని రామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆమెపై సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆ తర్వాత అమర్‌సింగ్‌తో కలిసి రాష్ట్రీయ లోక్‌మంచ్‌ పేరుతో పార్టీ స్థాపించారు.
Read Also : ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే : ప్రియా వారియర్‌ చప్పుడు లేదేంటి

ట్రెండింగ్ వార్తలు