JEE Main : రెండు విడతల్లో జేఈఈ మెయిన్స్

జేఈఈ మెయిన్‌ పరీక్షలను 2019, 2020లో ఆన్‌లైన్‌ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో మాత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నాలుగు విడతల్లో...

jee Exams

JEE Main 2022: దేశంలోని N.I.Tల్లో ప్రవేశానికి, J.E.E అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అర్హుల్ని నిర్ణయించేందుకు ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. జాతీయ పరీక్షల మండలి ఈ షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్‌, మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్‌టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ డా. సాధనా పరాషర్‌ వెల్లడించారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.

Read More : JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం

జేఈఈ మెయిన్‌ పరీక్షలను 2019, 2020లో ఆన్‌లైన్‌ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో మాత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నాలుగు విడతల్లో నిర్వహించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనటం, ప్రత్యక్ష తరగతులూ జరుగుతున్నందున ఈసారి రెండుసార్లు నిర్వహిస్తే చాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read More : జులై-3న జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష…ఆ కీలక నిబంధన సవరింపు

మరోవైపు, ఐఐటీల్లో బీటెక్‌ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు జూన్‌ 8 నుంచి జూన్‌ 14 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితాలను జులై 18న వెల్లడించగా.. ఆ మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ మొదలవుతుందని వివరించింది.