జార్ఖండ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ నవంబర్ 30,శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
జార్ఖండ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ నవంబర్ 30,శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయం వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందిరికీ ఓటేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.
తొలి విడతలో భాగంగా 6 జిల్లాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ 13 స్థానాల్లో 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పోటీగా కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ మహాకూటమిగా పోటీలో ఉన్నాయి. జేఎంఎం 4, కాంగ్రెస్ 6, ఆర్జేడీ 3 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 81 స్థానాలు కాగా, ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 23న విడుదల కానున్నాయి.
> 3 వేల 906 పోలింగ్ కేంద్రాలున్నాయి.
> ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
> 2020 జనవరి 05తో రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.
> నవంబర్ 30న తొలి దశ పోలింగ్ కాగా..
> డిసెంబర్ 07న రెండో దశ.
> డిసెంబర్ 12న మూడో దశ.
> డిసెంబర్ 16న నాలుగో దశ.
> డిసెంబర్ 20న ఐదో దశ పోలింగ్ జరుగుతుంది.
> డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
Jharkhand: Voting underway at polling booth number 472 in Chatra. Voting on 13 constituencies in the state for the first phase of elections will be held today. #JharkhandAssemblyPolls pic.twitter.com/RpBAy4EKAX
— ANI (@ANI) November 30, 2019