ఆకాశమంత ఎత్తులో అయోధ్య రామాలయం

  • Publish Date - December 16, 2019 / 09:43 AM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో రామ మందిర నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. దశాబ్దాల నాటి అయోధ్య రామజన్మభూమి విషయంలో నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిదే. ఈ తీర్పు అనంతరం రామ మందిర నిర్మాణం ఎప్పుడు? అనే విషయంపై మాట్లాడుకోవటం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటనకూడా రాలేదు. 

ఈ క్రమంలో ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రామ మందిరం పనుల్ని మరో నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 4 నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తులో రామ మందిరాన్ని అత్యద్భుతంగా నిర్మిస్తామని షా ప్రకటించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీరాముడు ఆలయానికి మార్గం సుగమమం అయిందనీ..త్వరలోనే అయోధ్య రాముడు భక్తులకు దర్శనమిస్తాడని తెలిపారు. ఝార్ఖండ్‌లోని పాకూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.