viral photo : చిన్నారితో పాటు Online క్లాసులు వింటున్న కోతులు

  • Publish Date - October 13, 2020 / 06:18 PM IST

‘join’ online class as kid studies at home : అల్లరి పనులు చేస్తే..‘ఏంటా ఆ కోతి చేష్టలు? కుదురుగా ఉండలేవా అంటూ తిడుతుంటారు. పాడు పనులు చేసినా..చేసే పని చెడగొడుతున్నా అలాగే తిడతారు. అందుకే పెద్దలు ‘‘తాను చెడిన కోతి వనమంతా చెరిచింది’’అని అంటారు. నానా అల్లరి చేసే కోతులు ఓ చోట మాత్రం కామ్‌గా కూర్చున్నాయి.


అంతేకాదండోయ్.. కిటికీ ఊచలు పట్టుకుని కుదురుగా కూర్చుని ఆన్‌లైన్ క్లాసుల్ని మహా శ్రద్ధగా విన్నాయి కోతుల గుంపు. వాటిని చూసినవారు ఇవి నిజంగా కోతులేనా? లేదా ఫోటోనా అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిశ్శబ్దంగా ఉంటే అవి కోతులు ఎలా అవుతాయి? కదిలితే నిజమైన కోతులు..కదలకుంటే అదొక ఫోటో అయినా అయుండాలి అని బుగ్గన వేలేసుకుని మరీ పరీక్షగా చూస్తున్నారు.


కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటోలో ఓ చిన్నారి యూనిఫాం వేసుకుని ఐడీ కార్డ్ కూడా మెడలో వేసుకుని స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసులు వింటోంది. ఆ చిన్నారి వెనుక ఉన్న కిటికీ ఊచలు పట్టుకుని మూడు కొండముచ్చులు వచ్చి కూర్చున్నాయి.


కోతులు తమ సహజమైన అల్లరి చేష్టలు మాని చిన్నారి చదువుకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అలా కుదురుగా కూర్చుని శ్రద్ధగా ఆన్ లైన్ క్లాసు వింటున్నట్లుగా కూర్చున్నాయి. అది చూసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపోయారు.



కోతుల్లో అల్లరినే చూస్తాం కానీ కోతులు ఇలా కుదురుగా కూర్చుంటాయని ఈ సీన్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం అదికాస్తా వైరల్ గా మారింది.