అవును..షాహిన్‌బాగ్‌లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసలు ఈ మెయిల్ ఎవరికి వెళ్లింది..?
తిరువనంతపురంకు చెందిన అబ్దుల్లా విజిటింగ్ వీసాపై దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. తర్వాత కొంత సమయం తర్వాత..అబ్దుల్లా దానికి రిప్లై ఇచ్చాడు. జాబ్ ఎంక్వయిరీ..మెకానికల్ ఇంజనీర్..శాలరీ లేకుండా..ట్రైనింగ్ పీరియడ్‌లో పనిచేస్తానని మెయిల్ పెట్టారు. అప్పుడు జయంత్ గోఖలే పేరిట ఉన్న అకౌంట్ నుంచి మెయిల్ వచ్చింది.
ఉద్యోగంతో పనేంటీ ?ఢిల్లీ వెళ్లి షాహిన్ బాగ్‌లో కూర్చొ. రోజుకు రూ. 1000, బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు అని మెయిల్‌లో ఉంది. దీనిని స్క్రీన్ షాట్ తీసి తన సోదరుడి ఫ్రెండ్‌కు పోస్టు చేశానని అబ్దుల్లా వెల్లడించాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్టు అయ్యింది. తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.
తనకు మెయిల్ చేసిన వ్యక్తిపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదని, నాకు ఏదైనా ఉద్యోగం సంపాదించడమే లక్ష్యమని అబ్దుల్లా వెల్లడించారు. ఇదంతా అబద్ధమని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన కారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA)ని వ్యతిరేకిస్తూ..దేశ రాజధానిలోని షాహిన్‌నగర్‌లో ఆందోళన కారులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
Read More : క్లీన్ వార్డు : అన్నీ వైరస్‌లకు ఒకే చోట చికిత్స