Justice DY Chandrachud: భారత నూతన న్యాయమూర్తిగా నియామకమైన జస్టిస్ చంద్రచూడ్ గురించి 5 కీలక విషయాలు

సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి సోమవారంనాడు ఆమోదం తెలిపారు. సీజేఐ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు.

Justice DY Chandrachud: భారత రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి జస్టిస్ డీవీ చంద్రచూడ్‌‭ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. నవంబర్ 9న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ భాద్యతలు చేపట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారంనాడు ఒక ట్వీట్‌లో ఈ విషయం తెలిపారు. కొత్త సీజేఐకి అభినందనలు తెలిపారు.

సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి సోమవారంనాడు ఆమోదం తెలిపారు. సీజేఐ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు.

జస్టిస్ చంద్రచూడ్ గురించి కొన్ని ముఖ్య విషయాలు..
-ఎక్కువ కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వైసీ చంద్రచూడ్ కుమారుడే ఈ జస్టిస్ డీవై చంద్రచూడ్. తండ్రి, కొడుకులు భారత ప్రధాన న్యాయమూర్తులుగా పని చేయడం దేశంలో ఇదే మొదటిసారి.
-అసమ్మతిని ప్రజాస్వామ్య సేఫ్టీ వాల్వులని భావించే జస్టిస్ చంద్రచూడ్.. అయోధ్య భూ వివాదం, గోప్యత హక్కు సహా అనేక రాజ్యాంగ బెంచ్‌లతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మైలురాయి తీర్పులలో ఈయన భాగంగా ఉన్నారు.
-ఐపీసీలోని సెక్షన్ 377 అంశంలోని స్వలింగ సంబంధాలను నేరరహితం చేయడం సహా ఆధార్ పథకం చెల్లుబాటు, శబరిమల సమస్యను పాక్షికంగా కొట్టివేత వంటి తీర్పులు వెలువరించిన బెంచ్‌లలో చంద్రచూడ్ ఉన్నారు.
-చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం పరిధిని, గర్భం దాల్చిన 20-24 వారాల మధ్య అబార్షన్ కోసం అవివాహిత స్త్రీలను చేర్చడానికి సంబంధిత నిబంధనలను విస్తరించింది.
-న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో ఆనర్స్‌తో బీఏ పూర్తి చేసిన ఆయన.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్ఎల్‭బీ చేశారు. అనంతరం హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్‭ఎం డిగ్రీ, జురిడికల్ సైన్సెస్‭లో డాక్టరేట్ పొందారు.

New Chief: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా సరే.. గాంధీ కుటుంబం చెప్పినట్లు వినాల్సిందేనట!

ట్రెండింగ్ వార్తలు