Kacha Badam
Kacha Badam: భుబన్ బడ్యాకర్ అంటే అందరికీ తెలియకపోవచ్చు.. ఎందుకంటే అతను ఫ్యామస్ అయింది కచ్చా బదాం పాటతోనే. కొన్ని నెలలుగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ పాటతో వచ్చిన ఫేమ్ కు భయపడి.. బయటకు రావడానికి కార్ కొనుక్కొని అందులోనే ప్రయాణిస్తున్నాడు.
రీసెంట్ గా అతని స్వగ్రామమైన వెస్ట్ బెంగాల్ లోని బిర్‌భుమ్ జిల్లాలో అతనికి యాక్సిడెంట్ అయింది. కొత్త కారును ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకుంటున్న క్రమంలో గోడకు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అతని మొహంపై కూడా కొన్ని గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత గాయాల నుంచి బయటపడ్డ సింగర్ మరో పాటతో ట్రెండింగ్ గా మారిపోయాడు.
అమర్ నోతున్ గరీ ( బెంగాలీ భాషలో నా కొత్త కారు) అనే అర్థంతో పాడుతున్న పాట వైరల్ అయింది.
Read Also : ‘కచ్చా బాదమ్’ సింగర్ భుబన్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్..! అతడి కష్టానికి ఇంతేనా?
ఆ పాటలో అతను సెకండ్ హ్యాండ్ కార్ ఎలా కొన్నాడని, నేర్చుకుంటున్న క్రమంలో దురదృష్టవశాత్తు గోడను ఎలా ఢీ కొట్టాడని అందులో వివరించాడు. ఇంకా తీవ్రగాయాలు కాకుండానే దేవుడు కాపాడంటూ యాక్సిడెంట్ గురించా పాట పాడాడు.
పాటపై ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన బద్యాకర్.. ‘నేను సెకండ్ హ్యాండ్ కార్ కొన్నా. డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నించా. అది గోడకు తగిలి యాక్సిడెంట్ అవడంతో గాయాలయ్యాయి. ఇప్పుడు ఏ సమస్యా లేదు. అందుకే కార్ గురించి కొత్త పాట పాడదామనుకున్నా’ అని ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.