Kacha Badam : ‘కచ్చా బాదమ్’ సింగర్ భుబన్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్..! అతడి కష్టానికి ఇంతేనా?

కచ్చా బాదమ్.. నెట్టింట్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఎక్కడ చూసినా ఇదే పాట.. ఇప్పుడీ పాటకు ప్రపంచమంతా ఫిదా అయింది. రిమిక్స్ వెర్షన్‌లో కచ్చా బాదమ్ సాంగ్ మారుమోగిపోతోంది.

Kacha Badam : ‘కచ్చా బాదమ్’ సింగర్ భుబన్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్..! అతడి కష్టానికి ఇంతేనా?

Kacha Badam Singer Bhuban Badyakar Receives Rs 3 Lakh From Music Company For His Viral Song

Kacha Badam Viral Song  Singer : కచ్చా బాదమ్.. నెట్టింట్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఎక్కడ చూసినా ఇదే పాట.. ఇప్పుడీ పాటకు ప్రపంచమంతా ఫిదా అయింది. రిమిక్స్ వెర్షన్‌లో కచ్చా బాదమ్ సాంగ్ మారుమోగిపోతోంది. బాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది ఈ కచ్చా బాదమ్ రిమిక్స్ సాంగ్ కు హుషారైన స్టెప్పులేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. పల్లీలు అమ్ముకునే సాధారణ వ్యక్తి ఈ పాటను క్రియేట్ చేయగా.. దానికి మ్యూజిక్ జోడించి రిమిక్స్‌తో సోషల్ మీడియలోకి వదిలారు. అంతే.. ఈ పాటకు లక్షల కొద్ది వ్యూస్ వచ్చిపడుతున్నాయి. అంతగా పాపులర్ అయిపోయింది. ఈ పాటను పశ్చిమ బెంగాల్ కు చెందిన పల్లీలు అమ్మే భుబన్ బద్యాకర్ (Bhuban Badyakar) రూపొందించాడు. పల్లీలు అమ్ముతూ వీధుల్లో ఈ పాటను పాడేవాడు.. ఒక యూట్యూబర్ బద్యాకర్ టాలెంట్ గుర్తించి అతడు పాడిన కచ్చా బాదమ్ వీడియోను తన యూట్యూబ్ లో పోస్టు చేశాడు. అంతే.. కచ్చా బాదమ్ సాంగ్ వైరల్ అయింది. అది చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఆ పాటకు రిమిక్స్ జోడించి వైరల్ చేశారు. ఈ కచ్చాబాదమ్ సాంగ్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు బద్యాకర్.. నెలకు పైగా ఈ కచ్చాం బాదమ్ వ్యూస్ సునామీ సృష్టిస్తోంది. పెప్పీ ట్యూన్‌లతో వేలాది మంది ఈ పాటకు డ్యాన్సులతో అదరగొట్టేస్తున్నారు.

రూ.3 లక్షలకు గోధూలిబేల మ్యూజిక్ ఒప్పందం..
ఈ కచ్చా బాదమ్ వైరల్ సాంగ్‌ను క్రియేట్ చేసిన భుబన్ బద్యాకర్‌ లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఈ వైరల్ సాంగ్‌కు రీమిక్స్ వెర్షన్‌ను రూపొందించిన గోధూలిబేల మ్యూజిక్ (Godhulibela Music) రూ. 3 లక్షల వరకు బద్యాకర్ కు అందించింది. పాపులర్ అయిన ఈ పాటను సృష్టించిన పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌కు చెందిన పేద వేరుశెనగ విక్రేతకు ఏమైనా రెమ్యునరేషన్ దక్కిందా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బద్యాకర్‌ ఈ వైరల్ సాంగ్ ద్వారా ఏమైనా లబ్దిపోందాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గోధూలిబేల అనే మ్యూజిక్ కంపెనీ బద్యాకర్ నుంచి కచ్చా బాదమ్ రైట్స్ కొనేసింది. ఈ ఒప్పందంలో భాగంగా బద్యాకర్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. ‘భుబన్‌తో రూ. 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాం. అతనికి అడ్వాన్స్‌గా రూ. 1.5 చెక్కు అందించాం. మిగిలిన మొత్తం వచ్చే వారం అతనికి చెల్లిస్తాం’ అని గోధూలిబేల మ్యూజిక్ గోపాల్ ఘోష్ చెప్పారు. ఇంతగా సంచనలం సృష్టించిన ఈ కచ్చా బాదమ్ ద్వారా బద్యాకర్ పెద్దగా ఏమి పొందలేదని ఆయన అన్నారు. ఈ పాటకు ఆయన కాపీరైట్ కలిగి ఉండటంతో రూ.3 లక్షలు చెల్లించాల్సి వచ్చిందన్నారు.

Read Also : Kacha Badam : దుమ్ములేపుతున్న ‘కచ్చా బాదమ్’.. సెలబ్రిటీలు, యూత్ డ్యాన్స్ మూమెంట్స్ కేక

అంతా దేవుడి దయ.. ఆనందంలో బద్యాకర్.. :
బద్యాకర్ బీర్భూమ్ జిల్లాలోని పలు గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ వేరుశెనగలను విక్రయించేవాడు. అయతే అతడు కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ పాటను రూపొందించాడు. కచ్చా బాదమ్ పాట వైరల్ కావడంతో పశ్చిమ బెంగాల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకువచ్చి బెంగాల్ పోలీసులు సత్కరించారు. ఈ సందర్భంగా బద్యాకర్ మాట్లాడుతూ.. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను చాలా గొప్పదిగా భావిస్తున్నాను. నేను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అంతా ఆ దేవుడి దయ.. ఇంత మంచిపేరు నాకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను ఈ పదాలను కచ్చా బాదమ్ పాటగా మార్చాను. కానీ, ఇంత హైలైట్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు’ అని బద్యాకర్ చెప్పుకొచ్చాడు. నెల రోజుల క్రితమే రీమిక్స్ చేసిన ఈ పాటకు యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట బాగా పాపులర్ కావడంతో కేవలం అతడి కష్టానికి రూ. 3 లక్షలు మాత్రమేనా అంటూ నెట్టింట్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Kacha Badam Singer Bhuban Badyakar Receives Rs 3 Lakh From Music Company For His Viral Song (1)

కచ్చా బదామ్ అంటే ఏంటి? :
“కచ్చా బదామ్ అనేది పచ్చి పల్లీలకు బెంగాలీ పదం. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్‌జూరి గ్రామానికి చెందిన భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పల్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ఊరూరూ తిరుగుతూ పాత సమానుకి.. పచ్చి పల్లీలు అమ్ముకుంటాడు. అయితే అతడు కస్టమర్లను ఆకర్షించేందుకు పాటలు పాడుతుండేవాడు. ఇంటిలో పాడైపోయిన వస్తువులు, చేతి గాజులు, పనికిరాని గిల్టు నగలు తనకు ఇస్తే.. పాలుగారే పచ్చి పల్లీలు ఇస్తానంటూ కస్టమర్లకు క్యానవాస్ చేస్తుంటాడు. రోజూ చెప్పిందే చెప్పడం కంటే.. తాను వాడే పదాలనే పాటగా మార్చి చెబితే గ్రామాల్లోని ప్రజలు మరింత ఆకర్షితులవుతారని భుబన్ భావించాడు. ఆ పదాలన్నింటిని కలిపి ‘కచ్చా బదాం’ అనే పాటను రూపొందించాడు. బెంగాలీ పదాలతో, జానపద గేయాల్లోని రాగాలతో ఈ పాటకు ట్యూన్ కట్టాడు. ఊరూరా తిరుగుతూ, ఈ పాటను పాడుతూ పల్లీలు అమ్ముతున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో ఒక యూట్యూబ్ వ్లోగర్ భుబన్ పాటకు ఫిదా అయిపోయాడు.

బద్యాకర్ కచ్చా బాదమ్ పాట పాడుతున్న వీడియోను రికార్డు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అది చూసిన హిందీ సంగీత ప్రియులు.. పాటను రీమిక్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. లిరిక్స్ అర్ధం కాకపోయినా పాట వినగానే నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఈ పాటకు ఫిదా అయిపోయారు. నెల రోజుల్లోనే ఈ కచ్చా బాదమ్ పాట.. దేశం ధాటి ఖండాంతరాలు దాటి నెట్టింట్లో సునామి సృష్టిస్తోంది. ఆఖరికి కొరియా నుంచి టాంజానియా వరకు కూడా కచ్చా బదాం పాకింది. కచ్చా బదాం పాట వైరల్ కావడంతో ఒరిజినల్ సింగర్ భుబన్ గురించి ప్రపంచానికి తెలిసింది. కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు, పాపులర్ సింగర్లు భుబన్‌ను కలిసి ఆ పాట రైట్స్ కొనేసుకున్నారు. భుబన్‌ను తమ ఆల్బంలో భాగం చేసి వీడియోలు కూడా చేశారు.

Read Also : ‘Kacha Badam’ Song :ఈ పల్లీలు అమ్మే వ్యక్తి పాటకు ప్రపంచమే ఫిదా..లల్లాయి పాటతో వరల్డ్ వైరల్