‘Kacha Badam’ Song :ఈ పల్లీలు అమ్మే వ్యక్తి పాటకు ప్రపంచమే ఫిదా..లల్లాయి పాటతో వరల్డ్ వైరల్

ఈ పల్లీలు అమ్మే ఓ పేదవాడు పాటకు ప్రపంచమే ఫిదా అవుతోంది. పల్లీలు అమ్ముకోవటానికి పాడిన ఓ లల్లాయి పాట స్టైల్ తో ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాడీ పల్లీల వ్యక్తి.

‘Kacha Badam’ Song :ఈ పల్లీలు అమ్మే వ్యక్తి పాటకు ప్రపంచమే ఫిదా..లల్లాయి పాటతో వరల్డ్ వైరల్

Kacha Badam Bhuban Badyakar

Updated On : February 4, 2022 / 5:49 PM IST

Kacha Badam Bhuban Badyakar: సోషల్ మీడియా.వింతలతో పాటు వివాదాలను కూడా తెరపైకి తెచ్చే సోషల్ మీడియా కుగ్రామాల్లో గల్లీల్లోని ప్రతిభలను కూడా వెలికి తీస్తోంది. ప్రపంచానికి పరిచయంచేస్తోంది. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలబ్రిటీలైపోయారు. ఏదో లల్లాయి పాటు పాడుకునే వారు కూడా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నారు సోషల్ మీడియా వేదికపై. ఇప్పుడు అటువంటి ఓ అత్యంత సాధారణ వ్యక్తి..పల్లీలు అమ్ముకుంటేనే కుటుంబం ఓ పూట తినగలిగే కడు పేదవాడు పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన ‘కచ్చా బాదం’ పాడిన జింగిల్ పాట తెగ వైరల్ అవుతోంది. పశ్చి బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక పాట పాడాడు. ‘బాదం బాదం కచా బాదం’అంటూ ఓ విధమైన స్టైల్లో పాడాడు.

ఈ పాటతో సదరు పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ భారతదేశంలోనే కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అతను పాడిన కచ్చా బాదం సాంగ్‌ తో తెగ విపరీతంగా వైరల్ అవుతున్నాడు. అతని ట్యూన్ కు ఫిదా అయిపోయినవారు భారతదేశంలోని పలు రియాల్టీ షోలలకు రమ్మని ఆహ్వానాలు పలుకేంత వైరల్ అయ్యాడు.

కుగ్రామం పేదవాడు ఒక్క పాటతో వరల్డ్ ఫేమస్..
కచ్చా బాదం (పచ్చి పల్లీలు) అమ్ముకుంటున్న భుబన్ బద్యాకర్.. ఓరకం స్టైల్లో పల్లీలు అమ్మే విధానం కొందరికి నచ్చింది. దాంతో అతని స్టైల్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇతని వాయిస్ ప్రపంచమంతా వైరల్ అవుతోంది. పోర్చుగీసులో ఓ తండ్రీ కూతురు ఇతని స్టైల్ ను అనుకరించి తెగ స్టెప్పులు కూడా వేశారు. సౌత్ కొరియన్ తల్లీ కూతురు డ్యాన్స్‌ ఇరగదీశారు.

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్‌జూరి గ్రామంలో భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో నివసిస్తున్నాడు భుబన్ బద్యాకర్. పచ్చి వేరుశెనగ అమ్మడానికి సైకిల్‌పై ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్ని తిరుగుతుంటాడు. ఓ పాత మోటర్ సైకిల్ పై శెనక్కాయల మూట పెట్టుకుని ఓ చోట నిలబడతాడు. అంతే చేతిలో ఉన్న ఫోన్ ను విచిత్రంగా తిప్పుతు అంతకంటే విచిత్రంగా ఓ విధమైన స్టైల్లో పల్లీలు వెరైటీగా అమ్ముతుంటాడు. పల్లీలు అమ్ముతూ రోజుకు రూ.250 సంపాదిస్తాడు.

లల్లాయి పదాలతో ప్రపంచవ్యాప్తంగా వైరల్..
మీ దగ్గర పాత గాజులు, పాత గొలుసులు ఉంటే, మీరు వాటిని నాకు ఇవ్వవచ్చు, నేను మీకు సమానమైన వేరుశెనగలను ఇస్తాను అని పాట పాడుతూ అమ్ముకునే వాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. కచా బాదం పాట ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీధిలో వేరుశెనగలను విక్రయించే భుబన్ యొక్క ప్రత్యేకమైన స్టైల్‌నిఎవరో రికార్డ్ చేసి..ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో అది కాస్తా ట్రెండ్ అయ్యింది. కచా బాదం పాటను ‘ఏక్తారా’ అనే ఛానెల్ మొదట క్యాప్చర్ చేసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. 2 నెలల వ్యవధిలో, 21 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

కచ్చా బాదం పాటకు దక్షిణ కొరియాకు చెందిన తల్లీకూతుళ్లు ఫిదా డ్యాన్స్ తో జోష్
ఇటీవల ఇంటర్నెట్ సంచలనం కిలీ పాల్ కూడా కచ్చా బాదం పాటకు స్టెప్పులు వేశాడు. దక్షిణ కొరియాకు చెందిన తల్లీకూతుళ్లు కూడా ఈ పాటకు ఫిదా అయి కాలు కదిపారు. భుబన్ గత 10 సంవత్సరాలుగా వేరుశెనగలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను తన ‘కచా బాదం’ పాట ద్వారా సోషల్ మీడియాలో కొత్తగా వచ్చిన కీర్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ జనాదరణ పొందిన పాటను కంపోజ్ చేయడానికి ప్రేరణ ప్రసిద్ధ బౌల్ జానపద ట్యూన్ నుండి వచ్చింది. ఇటీవల ఈ ట్రెండీ పాటను ర్యాప్ రూపంలో రీమేక్ చేసారు కూడా.