Kamal Nath: సీఎల్పీ పదవికి కమల్ నాథ్ రాజీనామా

మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్, ఆ పదవికి రాజీనామా చేశారు.

Kamal Nath

Kamal Nath: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్, ఆ పదవికి రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రెండు నెలల క్రితమే లేఖ ద్వారా కమల్ నాథ్ చెప్పినట్లు సమాచారం. కాగా, ఆయన నిర్ణయాన్ని ఆమోదిస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. శాసన సభా పక్ష నేతగా కమల్ నాథ్ రాజీనామా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని వేణుగోపాల్ తెలిపారు.

Congress : ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?!

ఆయన స్థానంలో డా.గోవింద్ సింగ్ సీఎల్పీ నేతగా కొనసాగుతారని పార్టీ స్పష్టం చేసింది. ఇంతకాలం సీఎల్పీ నేతగా కమల్ నాథ్ చేసిన సేవలకుగాను కాంగ్రెస్ అధిష్టానం అభినందనలు తెలిపింది. కమల్ నాథ్ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 2018లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే, 2020లో జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది.