Kanpur Crime : సెక్రటరీని రేప్ చేసి..10వ అంతస్తు నుంచి తోసేసిన బాస్

తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల యవతిపై అత్యాచారం చేసి 10వ అంతస్తు నుంచి తోసి హత్య చేసిన ఘటన యూపీలోని కాన్పూరులో చోటుచేసుకుంది.

kanpur Crime 19 years wome rape : తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల ఉద్యోగినిపై కన్నేశాడు బాస్. తనకోరిక తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆమెనుఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు.దీంతో పని ఉంది తన ఇంటికి రమ్మన్నాడు. కానీ ఆమె అనుమానించింది. భయపడింది.కానీ అసలే కరోనా సంక్షోభం ఉద్యోగం మానేస్తే ఇంటి పరిస్థితి ఏంటి అని ఆలోచించింది. అలా కాస్త ధైర్యం చేసి వెళ్లింది. కాదు వెళ్లాల్సి వచ్చింది. కానీ తన కూతురు వయస్సున్న ఆ అమ్మాయిపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించేసరికి తాను ఉంటున్న 10వ అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ప్రతీక్ వైశ్ అనే 40 ఏళ్ల వ్యక్తి డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద 19 ఏళ్ల యువతి సెక్రటరీగా పని చేస్తోంది. ఆమెపై కన్నేసిన ప్రతీక్ ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. దీంట్లో భాగంగా కల్యాణ్‌పూర్‌లో ఉంటున్న తన ఫ్లాట్ కు రమ్మని రమ్మన్నాడు. కానీ ఆమె భయపడింది. కానీ తప్పలేదు. అలా యజమాని ఉంటున్న గుల్మొహర్  అపార్ట్ మెంట్ 10 ఫ్లాట్ కు వెళ్లింది.

Read more: Girl Raped By Father : కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

చాలా రోజులుగా యువతిని లొంగదీసుకోవడానికి యత్నిస్తున్న ప్రతీక్ తన ఇంట్లోకి వచ్చిన యువతిపై బలవంతం చేయబోయాడు. ఆమె దానికి ఒప్పుకోలేదు. డబ్బులు కూడా ఇస్తాను..నా కోరిక తీర్చు అంటూ ఆమెను అడిగాడు..బతిమాలాడు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు.. నన్ను వదిలేయండి అంటూ వేడుకుంది. అయినా అతడు వినలేదు. కాళ్లు పట్టుకుని బతిమలాడింది. మీరు నాకు తండ్రిలాంటివారు.. నేను మీ కూతురు వయస్సు దాన్ని దయచేసి వదిలేయాలని బతిమిలాడింది. కానీ ఆ పశువు ఊరుకోలేదు.

తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎంత ఒత్తిడి చేసినా.. ప్రలోభాలకు గురిచేసినా వినకపోవడంతో అత్యాచారం చేశాడు. అతని పశుబలం ముందు లేడికూనలా అల్లాడిపోయిందా అమ్మాయి. తరువాత ఏడుస్తూ.. పోలీసులకు చెబుతాననడంతో కామాంధుడు ప్రతీక్ కాస్తా కిరాతకుడిగా మారిపోయాడు. అంతే… తన గురించి పోలీసులకు ఎక్కడ చెబుతుందోనని భయపడ్డాడు.

Read more : Girl Raped : బస్సులో బాలికపై అత్యాచారం.. యూపీలో దారుణం

ఆమెను గట్టిగా పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ లాక్కెళ్లి తాను నివసిస్తున్న 10వ అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె చనిపోయింది.  ఆ తరువాత ఏమీ తెలియనట్లుగా ప్రమాదం జరిగి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించిన పోలీసులు తమదైన శైలిలో ప్రతీక్ ను ప్రశ్నించగా అసలు విషయం ఒప్పుకున్నాడు.దీంతో కాన్పూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బీబీజీటీఎస్ అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని అన్ని ఆధారాలతో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తరువాత కోర్టు ఆదేశాలతో నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు