Chandrababu Varanasi Visit: కాశీ విశ్వనాథుని సేవలో ఏపీ సీఎం.. కేంద్ర మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు.. వేద పండితుల ఆశీర్వచనం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి(Chandrababu Varanasi Visit)లో పర్యటించారు.
Chandrababu naidu varanasi visit kashi vishwanath pooja sewa sankalp abhiyan
- కాశీలో చంద్రబాబు పూజలు
- మోడీ సేవా అభియాన్
- ప్రసాద వితరణలో సీఎం
Chandrababu Varanasi Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఆయన కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో కలిసి సీఎం చంద్రబాబు ఆలయానికి విచ్చేసి పవిత్ర వాతావరణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని పర్యటనను ప్రారంభించారు.
కాశీ విశ్వనాథునికి జలాభిషేకం.. ప్రసాద వితరణ:
ఆలయ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు(Chandrababu Varanasi Visit) శ్రీ కాశీ విశ్వనాథుడికి పవిత్ర జలాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం తో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో కలిసి చంద్రబాబు స్వయంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వారణాసి నుంచి వాద్నగర్ వరకు సేవా యాత్ర:
ప్రధాని మోడీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా వారణాసి నుంచి ప్రధాని స్వగ్రామం వాద్నగర్ వరకు ప్రత్యేక బైక్ యాత్ర ద్వారా పవిత్ర జలాలను తీసుకెళ్తున్నారు. ఈ యాత్రకు శ్రీకారం చుట్టే ముందు సీఎం చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు.
