Bodybuilder Chitra Purushotham : పెళ్లి కూతురు గెటప్‌లో కండల రాణి స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు చూస్తే..

తన కండల ప్రదర్శనను, సంప్రదాయాన్ని మిక్స్ చేస్తూ ఈ కండల రాణి చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది.

  • Published On : March 8, 2025 / 05:00 AM IST

Bodybuilder Chitra Purushotham : చిత్రా పురుషోత్తం.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ బాడీ బిల్డర్. ఫిట్ నెస్ ట్రైనర్. కండలు తిరిగిన దేహం ఆమె సొంతం. ఆమె దేహాన్ని చూస్తే ఔరా అనకుండా ఉండలేరు. ఏమి ఈ సిత్రం అని అలా చూస్తూ మైమరిచిపోవాల్సిందే. అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆమె కండలు కలిగి ఉంది. ఒంపులు తిరిగిన ఆమె కండల దేహాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

తాజాగా చిత్రా పురుషోత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. పెళ్లి కూతురు లుక్ లో అదరగొట్టారు. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఆమె లుక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. కంచి పట్టు చీరలో కండల రాణి ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోనివ్వడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

Bodybuilder Chitra (Photo Credit : Google)

చిత్ర పురుషోత్తం వృత్తి పరంగా బాడీ బిల్డర్, ఫిట్ నెస్ ట్రైనర్ అయినప్పటికీ.. సంప్రదాయాలను గౌరవించారు. వధువు గెటప్ లో పెళ్లిలో ఆమె చేసిన కండల ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన కండల ప్రదర్శనను, సంప్రదాయాన్ని మిక్స్ చేస్తూ ఈ కండల రాణి చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది.

Bodybuilder Chitra Purushotham Look (Photo Credit : Instagram)

పసుపు, నీలం రంగు కాంజీవరం పట్టుచీర ధరించి కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించారు చిత్రా. కమర్ బంద్, మాంగ్ టిక్కా, చెవిపోగులు, గాజులు వంటి సాంప్రదాయ బంగారు ఆభరణాలతో పెళ్లి లుక్‌ లో వావ్ అనిపించారు. బోల్డ్ ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ మరింత అందం తెచ్చింది. క్కగా జడ వేసుకుని, మల్లె పువ్వులతో అలంకరించుకున్న తీరు అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

Also Read : మహాకుంభ్ లో రూ.30 కోట్లు సంపాదించింది ఇదిగో ఈ ఫ్యామిలీనే..

 

మహిళా బాడీ బిల్డర్ పెళ్లి కూతురు లుక్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని, అంకితభావాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ ప్రశంసనీయం అని కామెంట్ చేస్తున్నారు.

చిత్రా పురుషోత్తం తన దీర్ఘకాల భాగస్వామి కిరణ్ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ఫిట్‌నెస్ పోటీలలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగున్నారు. అనేక అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ మైసూర్ వడయార్, మిస్ బెంగళూరు టైటిల్స్ గెలిచారు. మిస్ కర్ణాటక పోటీలో టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచారు చిత్రా పురుషోత్తమ్. తాజాగా ఈ బాడీ బిల్డర్ వధువు లుక్ లో కంచిపట్టు చీరలో మరోసారి నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టారు.