Girlfriend : నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. గర్ల్ ఫ్రెండ్‌ను ట్రాలీ బ్యాగులో తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలనుకున్నాడు
ఓ విద్యార్థి తన లవర్ ని తన గదికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం పెద్ద స్కెచ్ కూడా వేశాడు. కానీ, ఆఖరి నిమిషంలో ప్లాన్ బెడిసికొట్టింది.
- Naveen
- Published on- February 4, 2022 / 11:35 PM IST
Girlfriend In Trolley Bag
Girlfriend In Trolley Bag : పోరగాళ్ల మీద సినిమాల ప్రభావం గట్టిగానే ఉంటోంది. చక్కగా చదువుకోవాల్సిన వయసులో తింగరి పనులు చేస్తున్నారు. బుద్ధిగా చదువుకోండి రా నాయనా.. అని తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తే… వాళ్లేమో తుంటరి పనులు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకుబోయే విషయం గురించి తెలిస్తే.. మీకు షాక్ కొట్టినంత పనవుతుంది. ఇలాంటి ఘటన నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అని అంటారేమో.
మ్యాటర్ లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మణిపాల్ లోని ఒక హాస్టల్లో జరిగిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ విద్యార్థి తన లవర్ ని తన గదికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం పెద్ద స్కెచ్ కూడా వేశాడు. కానీ, ఆఖరి నిమిషంలో ప్లాన్ బెడిసికొట్టింది. అతడు అడ్డంగా దొరికిపోయాడు. హాస్టల్ లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఓ విద్యార్థి తన కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను తన హాస్టల్ రూమ్‌కు తీసుకెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నాడు.
Worst Passwords: ఈ పాస్వర్డ్లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు
దీని కోసం ఆ కుర్రాడు ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని పెద్ద ట్రాలీ బ్యాగులో కుక్కేశాడు. ఆ బ్యాగుతో హాస్టల్‌కు చేరుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా హాస్టల్లోకి ట్రాలీ బ్యాగ్‌తో ఎంటర్ కావాలని చూశాడు. అయితే, గేటు బయట ఉన్న వార్డెన్ కు.. చేతిలో భారీ బ్యాగుతో వచ్చిన కుర్రాడి తీరుపై ఎందుకో అనుమానం వచ్చింది.
ఏంటి అంత పెద్ద లగేజీతో వస్తున్నావ్? ఏముంది అందులో? అంటూ హాస్టల్ వార్డెన్ ఆ అబ్బాయిని అడిగాడు. వార్డెన్ అలా అడిగేసరికి అతడు బిత్తరపోయాడు. ఆ తర్వాత.. తప్పు చేయనట్టు బిల్డప్ ఇచ్చాడు. ఆన్లైన్ లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాను, వాటిని లగేజీ బ్యాగులో పెట్టి తెచ్చాను అని చెప్పాడు. అదే సమయంలో అతడు కాస్త తడబడ్డాడు. అంతే.. ఆ వార్డెన్‌కు ఇంకా అనుమానం పెరిగింది. వెంటనే బ్యాగ్ ఓపెన్ చేయమని అడిగాడు. అందుకు ఆ కుర్రాడు నో చెప్పాడు. ఇందులో కొన్ని పగిలిపోయే వస్తువులు కూడా ఉన్నాయి.. ఇక్కడ ఓపెన్ చేయలేను అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా వార్డెన్ వినలేదు. బ్యాగ్‌ను తెరిపించాడు. దాంతో కుర్రాడి బండారం బయటపడింది.
బ్యాగ్‌లో అమ్మాయిని చూసి వార్డెన్ సహా చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ షాక్ అయ్యారు. అబ్బాయిని గట్టిగా అడగడంతో అతడు అలు విషయం బయటపెట్టాడు. ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అని ఆ కుర్రాడు చెప్పాడు. హాస్టల్లో ఇద్దరమూ ఎంజాయ్ చేయాలనుకున్నామని వెల్లడించాడు. అసలు విషయం తెలిసి.. వీడి దుంప తెగ అని… అంతా ముక్కున వేలేసుకున్నారు. కాగా, ఆ ఇద్దరు స్టూడెంట్స్‌ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఇద్దరినీ ఇళ్లకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Allu Arjun: వివాదంలో బన్నీ.. సౌత్ సినిమాను అవమానించొద్దంటున్న నెటిజన్లు.. అసలేం జరిగింది?
2020 ఏప్రిల్ లో కరోనా లాక్ డౌన్ సమయంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మంగళూరులో ఓ అబ్బాయి తన మగ ఫ్రెండ్ ని ఇలానే సూట్ కేసులో పెట్టి అపార్ట్ మెంట్ లోని తన రూమ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, అతడి ప్లాన్ బెడిసికొట్టింది. అతడు అడ్డంగా దొరికిపోయాడు. సూట్ కేసులో అబ్బాయిని చూసి అంతా విస్తుపోయారు.
