Allu Arjun: వివాదంలో బన్నీ.. సౌత్ సినిమాను అవమానించొద్దంటున్న నెటిజన్లు.. అసలేం జరిగింది?

రీసెంట్ గా.. ఈ ఐకన్ స్టార్ చేసిన జొమాటో యాడ్.. విమర్శలకు కారణమైంది. అందులో పుష్ప మేనరిజమ్ చూపిస్తూ.. అల్లు అర్జున్ చెప్పిన ఓ డైలాగ్ ట్రోల్ అవుతోంది.

Allu Arjun: వివాదంలో బన్నీ.. సౌత్ సినిమాను అవమానించొద్దంటున్న నెటిజన్లు.. అసలేం జరిగింది?

Zomato

Allu Arjun: పుష్ప సినిమాతో హ్యూజ్ హిట్ అందుకున్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ జోష్ లో ఉన్నాడు. స్టేట్ లెవల్ దాటి.. పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపి.. ఇంటర్నేషనల్ స్టార్లు కూడా పుష్పను చూసి ఇన్ స్పైర్ అయ్యేంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా.. అన్ని భాషల్లో వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతూ.. అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాడు. ఇక్కడివరకూ అంతా బానే ఉంది. బన్నీ స్టార్ డమ్ అమాంతం పెరుగుతూ వచ్చింది. కానీ.. రీసెంట్ గా.. ఈ ఐకన్ స్టార్ చేసిన జొమాటో యాడ్.. విమర్శలకు కారణమైంది. అందులో పుష్ప మేనరిజమ్ చూపిస్తూ.. అల్లు అర్జున్ చెప్పిన ఓ డైలాగ్.. సౌత్ ఇండియాను కించపరిచేదిగా ఉందని సోషల్ మీడియాలో ట్రోల్ అవడం మొదలైంది.

ఈ యాడ్ లో.. సుబ్బరాజు కూడా నటించాడు. ఇద్దరి మధ్య ఫైటింగ్ సీన్ ఉంటుంది. అందులో సుబ్బరాజును అమాంతం గాల్లోకి ఎత్తేస్తాడు బన్నీ. తనను త్వరగా కిందకు దించాలని సుబ్బరాజు అడుగుతాడు. అప్పుడు.. “సౌత్ సినిమా కదా. ఎక్కువ సేపు ఎగరాలి” అని బన్నీ కామెంట్ చేస్తాడు. ఇదే.. ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. సౌత్ ఇండియా సినిమాలను బన్నీ కించపరిచాడన్న విమర్శలు.. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. సౌత్ ఇండియా నుంచే స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్.. మూలాలు మరిచిపోతే ఎలా.. అన్న కామెంట్లు జోరందుకుంటున్నాయి. ఓ నెటిజన్ అయితే.. సౌత్ సినిమాను అవమానించారంటూ.. జొమాటో యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేస్తున్నట్టు ట్వీట్ చేశాడు.

గతంలోనూ.. బన్నీ నటించిన ఓ యాడ్ వివాదానికి కారణమైంది. రాపిడో సంస్థకు చెందిన ఈ ప్రకటనలో.. ఆర్టీసీని అవమానించారంటూ.. తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా.. డైరెక్ట్ గా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే బన్నీ అంబాసిడర్ గా నటించిన జొమాటో యాడ్ వంతు వచ్చింది. దీనికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది.. బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది.. టాపిక్ అవుతోంది.

పుష్ప ఫస్ట్ పార్ట్ కు ముందే.. అల్లు అర్జున్ కు నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. లాక్ డౌన్ పీరియడ్ లో.. సౌత్ సినిమాలు కూడా హిందీలోకి డబ్ అయ్యి.. అక్కడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా పుష్ప ఇచ్చిన సక్సెస్ తో.. అల్లు వారబ్బాయి.. నార్త్ లో మరింత గ్రిప్ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ తో నేషనల్ లెవల్ యాడ్లు కూడా బన్నీని వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతా బానే ఉన్నా.. ఈ విమర్శలే పంటికింద రాయిలా ఫీలవుతున్నారు ఐకన్ స్టార్ ఫ్యాన్స్. ఈ సంగతెలా ఉన్నా.. తర్వాత ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించే పనిలో బన్నీ స్పీడప్ అయ్యాడు. పుష్ప పార్ట్ టు కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఇదే టైమ్ లో.. ఇతర దర్శకుల ప్రాజెక్టులు కూడా వింటూ.. సాలిడ్ లైనప్ ను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.. ఐకన్ స్టార్.

Read More:

Allu Arjun : పుష్ప 50 రోజులు.. 365 కోట్ల కలెక్షన్స్.. తగ్గేదేలే..

Garikipati-Pushpa: పుష్పపై గరికపాటి ఫైర్.. స్మగ్లర్‌ను హీరోగా చూపించి ఏం మెసేజ్ ఇద్దామని!