Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు

కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే6న చోటుచేసుకున్న ఈఘటన..కర్ణాటకలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెబుతుంది.

Karnataka Contractor: ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టు పనులకు సంబంధించి బిల్లుల విడుదల కోసం ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ ప్రధాని మోదీకి లేఖ రాసిన ఘటనలో, అధికారులు తిరిగి సదరు కాంట్రాక్టర్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. అది కూడా విశ్వాస ఉల్లంఘన కేసు కావడం గమనార్హం. కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే6న చోటుచేసుకున్న ఈఘటన..కర్ణాటకలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెబుతుంది. ఇటీవల ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే యెర్రిస్వామి కుంటోజీ అనే వ్యక్తి లక్ష్మి ఎంటర్ ప్రైజస్ పేరుపై ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఈక్రమంలో పనులకు సంబంధించి బిల్లులు విడుదల చేయాలంటే.. తమకు 40 శాతం ఇవ్వాలంటూ స్థానిక రెవిన్యూ అధికారులు యెర్రిస్వామిపై ఒత్తిడి తెచ్చేవారు.

Other Stories:Andhra Pradesh: ఫోన్‌లో పెద్దగా మాట్లాడుతున్నాడని.. మోహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

అధికారుల తీరుతో విసిగిపోయిన గుత్తేదారు యెర్రిస్వామి..తనకు ఎదురైనా అనుభవాలను వివరిస్తూ..మే 3న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బిల్లులు ఇవ్వడమే ఆలస్యం అంటే..ఆపై అధికారులకు లంచాలు ఇస్తుంటే..తమకు పైసా కూడా మిగలడం లేదంటూ గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలాఉంటే..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కర్ణాటకలోని ముస్తూర్ గ్రామంలో ఘన వ్యర్థాల నిర్మూలన యూనిట్ కు ఏప్రిల్ 17, 2021 నుండి జూన్ 17, 2021 వరకు మెటీరియల్ సరఫరాలో గుత్తేదారు యెర్రిస్వామి కుంటోజీ అక్రమాలకు పాల్పడ్డాడని కారత్గి తాలూకా పంచాయితీ సభ్యుడు డి.మోహన్ మే6న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక సహాయ సిబ్బందితో కలిసి యెర్రిస్వామి అక్రమాలకు పాల్పడ్డాడని, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు వారికీ కొంత డబ్బు కూడా ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు డి మోహన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Other Stories:Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు

దీంతో పోలీసులు గుత్తేదారు యెర్రిస్వామి కుంటోజీపై విశ్వాస ఉల్లంఘన కేసు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై గుత్తేదారు యెర్రిస్వామి కుంటోజీ స్పందిస్తూ..రూ.15 లక్షల కాంట్రాక్టు విలువలో ఇప్పటి వరకు రూ.4.8 లక్షలు మాత్రమే తనకు వచ్చాయని మిగతా డబ్బు రాలేదని అన్నారు. గత పంచాయితీ సమయంలో పనుల కాంట్రాక్టు లభించగా, తరువాత వచ్చిన పంచాయతీ సభ్యులు తనను ఇబ్బంది పెడుతున్నారని యెర్రిస్వామి చెప్పుకొచ్చాడు. 40 శాతం డబ్బులు ఇవ్వనిదే బిల్లులు విడుదల చేయబోమని అవసరమైతే కేసులో ఇరికిస్తామంటూ అధికారులు తనను బెదిరించినట్లు యెర్రిస్వామి ఆరోపించాడు.

Other Stories:Budda Vanam : తెలంగాణ బుద్ధుని మార్గంలో పయనిస్తోంది : సీఎ కేసీఆర్

ఇదే విషయంపై సీఎం బసవరాజ్ బొమ్మై. పంచాయత్ రాజ్ మినిస్టర్ ఈశ్వరప్ప, ఇతర అధికారులకు లేఖలు కూడా రాశానని అయినా తనపై స్థానిక అధికారులు తప్పుడు కేసులు పెట్టారంటూ గుత్తేదారు యెర్రిస్వామి కుంటోజీ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప 40 శాతం లంచం అడిగారంటూ బెళగావికి చెందిన ఒక కాంట్రాక్టర్ మనస్థాపానికి గురై ఏప్రిల్ 12న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా కూడా చేశారు.

ట్రెండింగ్ వార్తలు