బెంగళూరు: బెంగళూరు: రూల్స్ బ్రేక్ చేస్తే చలానా రాసే ట్రాఫిక్ పోలీసులు కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా వదల్లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి చెందిన వ్యక్తిగత కారుకు సంబంధించి ట్రాఫిక్ ఉల్లంఘన కేసును నమోదు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.
Read Also : దరిద్రం పట్టిస్తున్నావ్ : TikTokకు రూ.40కోట్ల జరిమానా
ఈ క్రమంలో సీఎం కుమారస్వామికి రూ.300 ల జరిమానా విధిస్తు నోటీసులు జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఫిబ్రవరి 22న కుమారస్వామి కారు ట్రాఫిక్ నిబంధనలను పాటించలేదనీ..నిబంధలకు మించిన వేగంతో బెంగళూరు రోడ్లపై దూసుకుపోయిందనీ సదరు నోటీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు రూ.300 ఫైన్ నోటీసును సీఎం కార్యాలయానికి ఈ నోటీసును పంపించారు.
సాధారణంగా వీఐపీలు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా ఫైన్ వేసే సీన్ ఉండదు. అటువంటిది కర్ణాటక పోలీసులు సాక్షాత్తు సీఎం కారు ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఫైన్ విధించటం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి దీనిపై సీఎం కుమారస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం