Karnataka Covid Updates : కర్ణాటకలో కొత్తగా 5,339 కరోనా కేసులు, 48 మరణాలు..

కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్తగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.

Karnataka Covid Updates : కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్తగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం (ఫిబ్రవరి 9) కొత్తగా 5,339 కరోనావైరస్ కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులోడ్ సంఖ్య 39,12,100 ఉండగా.. మరణాల సంఖ్య 39,495కు చేరుకుంది. రాష్ట్రంలో 24 గంటల్లో 16,749 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం రికవరీల సంఖ్య 38,11,615కి చేరుకుందని హెల్త్ బులెటిన్ తెలిపింది. కొత్త కరోనా కేసులలో, 2,161 బెంగళూరు అర్బన్‌కు చెందినవే ఉన్నాయి. ఇక 6,883 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 16మంది కరోనాతో మరణించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 60,956కి చేరింది. రాష్ట్ర బులెటిన్ ప్రకారం.. రోజుకు పాజిటివిటీ రేటు 4.14శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు (CFR) 0.89శాతంగా నమోదైంది. కరోనాతో మరణించిన 48 మందిలో 16 మంది బెంగళూరు అర్బన్, దక్షిణ కన్నడ (5), బళ్లారి (4), చిత్రదుర్గ, తుమకూరు (3), ధార్వాడ్, కోలార్, మాండ్య, మైసూరు, శివమొగ్గ, ఉత్తర కన్నడ (2), ఇతరులు ఉన్నారు. బెంగళూరు అర్బన్ తర్వాత తుమకూరులో 342 కొత్త కేసులు, బెలగావిలో 327, మైసూరు 293, శివమొగ్గ 185, బళ్లారి 173, మాండ్య 158 కేసులతో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

బెంగళూరు అర్బన్ జిల్లాలో మొత్తం 17,64,476 కేసులు, మైసూరులో అత్యధికంగా 58,565 కేసులు నమోదయ్యాయి. 17,23,340 మంది డిశ్చార్జి కాగా.. బెంగళూరు అర్బన్ అగ్రస్థానంలో ఉంది. మైసూరు 2,22,680, తుమకూరు 1,54,122 మంది తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో మొత్తంగా, కరోనా టెస్టులను 6,30,20,402 మందికి నిర్వహించారు. వాటిలో 1,28,705 ఒక్కరోజే పరీక్షలు నిర్వహించారు.

Read Also : Most Covid Deaths : దేశంలో కరోనా మరణాలు.. ఎక్కువగా గుండె లేదా కిడ్నీ వ్యాధుల కారణంగానే.. నివేదిక వెల్లడి!

ట్రెండింగ్ వార్తలు