Most Covid Deaths : దేశంలో కరోనా మరణాలు.. ఎక్కువగా గుండె లేదా కిడ్నీ వ్యాధుల కారణంగానే.. నివేదిక వెల్లడి!

ఇప్పటివరకూ కరోనా బారిన పడినవారిలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయింది కేవలం ఒక్క కరోనాతో మాత్రమే కాదని ఓ నివేదిక వెల్లడించింది. 

Most Covid Deaths : దేశంలో కరోనా మరణాలు.. ఎక్కువగా గుండె లేదా కిడ్నీ వ్యాధుల కారణంగానే.. నివేదిక వెల్లడి!

Covid Deaths Most Covid Dea

Most Covid Deaths : దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించింది. దేశంలో ఎక్కడ చూసినా కరోనా కేసులు, మరణాలే వెలుగుచూశాయి. గతకొన్ని రోజుల నుంచి దేశంలో కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కరోనా తీవ్రతను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేశాయి. అవసరమైనచోట లాక్ డౌన్లు, కర్ఫ్యూలు విధించాయి. కరోనా కేసుల తీవ్రత తగ్గడంతో ఆయా రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకూ కరోనా బారిన పడినవారిలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయింది కేవలం ఒక్క కరోనాతో మాత్రమే కాదని ఓ నివేదిక వెల్లడించింది.

కరోనా మరణాల వెనుక ఇతర అనారోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. దేశ జాతీయ రాజధానిలో జనవరి 12 నుంచి ఫిబ్రవరి 7 మధ్యకాలంలో నమోదైన మొత్తం కరోనా మరణాలలో ఎక్కువమంది గుండె జబ్బులు లేదా కిడ్నీ వ్యాధులతోనే మరణాలు నమోదైనట్టు వెల్లడించింది. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా మృతిచెందినట్టు నివేదిక తెలిపింది.

ఇప్పటివరకూ నమోదైన 853 కోవిడ్-19 మరణాలలో, 779 లేదా 91శాతం ఇతర అనారోగ్యాలతో ఉన్నవారే అధికమని నివేదిక తేల్చింది. కరోనావైరస్ కారణంగా మరణించిన వారిలో కో-మోర్బిడ్ బాధితులే అధికంగా ఉన్నారని తెలిపింది. ప్రధానంగా గుండె జబ్బులు ఉన్న బాధితుల్లో 20శాతం, కిడ్నీ వ్యాధులతో 19శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది. కరోనా కారణంగా నమోదయ్యే మరణాలను కరోనావైరస్ మరణాలుగా పరిగణిస్తారు. కరోనా మరణాల్లో ఎక్కువగా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారే అధికంగా ఉన్నారని నిపుణుల బృందం విశ్లేషణలో తేలింది. న్యుమోనియా కోవిడ్‌కు విలక్షణమైనదిగా తేల్చారు. కరోనా మరణాలు చివరి దశలో అధికంగా ఉన్నాయని తెలిపారు.

జనవరిలో 750కి పైగా కరోనా మరణాలు :
జనవరిలో మొత్తంగా ఢిల్లీలో కరోనా కారణంగా 750కి పైగా మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కరోనావైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్య నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. మూడవ వేవ్‌లో నమోదైన ఎక్కువ మరణాలు ఇతర అనారోగ్య పరిస్థితుల వల్లనే నమోదయ్యాయని తేల్చారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కాదని తేల్చి చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. మునుపటి వేవ్ గణాంకాలతో పోలిస్తే ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ICUలో ఇతర అనారోగ్య సమస్యతో బాధపడేవారు మాత్రమే ఎక్కువగా ఉన్నారని నివేదిక వెల్లడించింది.

ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా రోజువారీ కేసులు, మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఢిల్లీలో గత 24 గంటల్లో COVID-19 కేసులు స్వల్పంగా పెరిగాయి, జాతీయ రాజధానిలో బుధవారం 1,317 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. దేశ రాజధానిలో యాక్టివ్ కేసులు 6,304 గా నమోదు కాగా.. కరోనా పాజిటివిటీ రేటు 2.11 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో మొత్తం 62,556 శాంపిల్స్ సేకరించగా 52,168 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

గత 24 గంటల్లో 1,908 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా, 13 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తంగా 18,15,188 మంది కరోనా నుంచి కోలుకోగా.. కరోనా మరణాల సంఖ్య 26,023గా నమోదైంది. గత 24 గంటల్లో, ఢిల్లీలో మొత్తం 97,260 కరోనా టీకా డోసులు అందుకున్నారు. అందులో 40,432 మంది 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు. మరో 7,562 మందికి ప్రీకాషన్ డోసును అందుకున్నారు.

Read Also : Spider-Man: No Way Home: రికార్డులు తిరగరాస్తున్న స్పైడర్ మ్యాన్.. అవతార్‌ని ఓవర్ టేక్?