×
Ad

గర్ల్‌ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడానికి, వివాహ ఖర్చుల కోసం ఈ యువకుడు ఏం చేశాడంటే? తనకు అన్నం పెడుతున్న బంధువు ఇంట్లోనే..

శ్రేయాస్ గత నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నాడు.

Karnataka: ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఓ యువకుడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి డబ్బులు మాత్రం లేవు. దీంతో బంధువు ఇంట్లో చోరీ చేసి ఆ డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసుకుని, అమలు చేశాడు. చివరకు అతడిని పోలీసులు పట్టుకున్నారు.

ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పెళ్లి ఖర్చుల కోసం బంధువు ఇంటి నుంచి రూ.47 లక్షల విలువైన బంగారం, నగదు దొంగిలించాడు శ్రేయాస్ (22) అనే యువకుడు. శ్రేయాస్ గత నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నాడు.

Also Read: ఈశాన్య భారత్‌ యువతికి బెంగళూరులో ఆటోవాలా చేతిలో ఊహించని పరిస్థితి.. వీడియో ఇదిగో.. 

ఇక వైవాహిక జీవితంలోకి అడుగుపెడదామనుకున్నాడు కానీ, పెళ్లి చేసుకోవడానికి డబ్బు మాత్రం లేదు. పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కావాలని, తన బంధువు హరీశ్ ఇంట్లో దొంగతనం చేయాలని స్కెచ్‌ వేసుకున్నాడు.

శ్రేయాస్‌కు హరీశ్ బంధువు మాత్రమే కాదు. శ్రేయాస్‌కు తన దుకాణంలో పని ఇచ్చి, తన ఇంటిని అతడికి రెంట్‌కి కూడా ఇచ్చాడు హరీశ్. అటువంటి వ్యక్తి ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు శ్రేయాస్.

హరీశ్ ఇంట్లో నగదు, నగలు ఉన్నాయని తెలుసుకుని, వాటిని దొంగిలించి తన పెళ్లి ఖర్చులకు వాడుకోవాలని అనుకున్నాడు. హరీశ్ ఇంట్లోకి చొరబడి పెద్ద ఎత్తున బంగారం, డబ్బు చోరీచేశాడు.

ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు బెంగళూరులోని హెబ్బగొడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, శ్రేయాస్‌ను అరెస్టు చేశారు. పోలీసులు 416 గ్రాముల బంగారం, రూ.3.46 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ సుమారు రూ.47 లక్షలు.