ఈశాన్య భారత్‌ యువతికి బెంగళూరులో ఆటోవాలా చేతిలో ఊహించని పరిస్థితి.. వీడియో ఇదిగో.. 

"అతను స్థానిక భాషలో మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. సాధారణ హిందీలో మాట్లాడాలని చెప్పినా నిరాకరించాడు" అని చెప్పింది.

ఈశాన్య భారత్‌ యువతికి బెంగళూరులో ఆటోవాలా చేతిలో ఊహించని పరిస్థితి.. వీడియో ఇదిగో.. 

Updated On : October 11, 2025 / 2:58 PM IST

Viral Video: బెంగళూరులో ఓ యువతికి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఈశాన్య భారత్‌కి చెందిన ఆ యువతి బెంగళూరులో ఓ ఆటోవాలా చేతిలో ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పోస్ట్ చేసింది. దీంతో బెంగళూరు పోలీసులు ఆమెను మరిన్ని వివరాలు కోరారు. ఊబర్‌ కూడా ఆమెకు క్షమాపణలు కోరింది.

ఎన్‌బీ అనే ఆ యువతి ఈ విధంగా పోస్టు చేసింది. “నిజంగా ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ ఘటన 02/10/25 రాత్రి 7 గంటలకు జరిగింది. ఒక ఊబర్ డ్రైవర్ (పవన్ హెచ్.ఎస్. బజాజ్ KA05AE4606) నన్ను దూషిస్తూ, వివక్ష చూపిస్తూ, వేధిస్తూ, డబ్బులు డిమాండ్ చేయడమేగాక, వీడియో తీసే ముందు అనేకసార్లు కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు.

ఇది కేవలం ట్రిప్ రద్దు చేసుకున్న విషయానికి సంబంధించిందే కాదు. డ్రైవర్ బెదిరింపు, దూషణలకు సంబంధించిన సమస్య. ఈ గొడవ ఎలా మొదలైందంటే.. యాప్‌లో “అరైవ్డ్” అని చూపించినా, డ్రైవర్ రాలేదు. 5-7 నిమిషాలు ఎదురుచూశాను. కాల్ చేసి నేను ఉన్న ప్లేస్‌ గురించి చెప్పినా, చాలా సేపు వేచి చూసిన తర్వాత కూడా రాలేదు. ఆలస్యమవుతోందని రైడ్ రద్దు చేసి మరో ఆటోలో వెళ్లాను.

కొన్ని మీటర్లు ముందుకు వెళ్లగానే ఆ మొదటి డ్రైవర్ కావాలనే దురుద్దేశంతో రోడ్డుమీద కనిపించి మేము ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. డబ్బు డిమాండ్ చేస్తూ దూషించాడు, కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఆటో నుంచి బయటకు వచ్చి నన్ను వీడియో తీయడం ప్రారంభించాడు.

అతను స్థానిక భాషలో మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. సాధారణ హిందీలో మాట్లాడాలని చెప్పినా నిరాకరించాడు. కొట్టేందుకు ప్రయత్నించడంతో నేను వీడియో తీయడం ప్రారంభించాను. అప్పుడు మాత్రమే అతను కొద్దిగా వెనక్కి తగ్గాడు. అతడే ముందుగా వీడియో తీశాడు.

డ్రైవర్ మర్యాదగా, నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడి ఉంటే, నేను అతడి ఆటోలో ఎక్కపోయినప్పటికీ డబ్బులు చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కానీ అతను వేధించడం, దూషించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డాడు.

అతను స్థానికుడని చెప్పుకుని, అలా ప్రవర్తించే హక్కు ఉందా? మమ్మల్ని తక్కువగా చూడటానికి హక్కు ఉందా? డిమాండ్ చేయడానికి, వేధించడానికి, దూషించడానికి హక్కు ఉందా? తాను తప్పించుకుంటానని ధైర్యంగా ప్రవర్తించాడు.

ఊబర్‌ను రద్దు చేసిన తర్వాత కూడా రాలేదు. అతను రాకపోతే నేను రైడ్ రద్దు చేయకూడదా? అతనికోసం రాత్రంతా వేచి చూడాలా? నాకు సమయం తక్కువగా ఉంది.. మొత్తం సాయంత్రం ఎదురు చూడలేకపోయాను. ఊబర్ డ్రైవర్లు ఇలా ప్రవర్తించడం షాకింగ్‌గా ఉంది. మన దేశంలో మనకే రక్షణలేనట్లుంది. దయచేసి చర్యలు తీసుకోవాలి” అని పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Enn Bii (@ennbii040)