Karnataka: పండ్ల వ్యాపారంపై హిందూ జన జాగృతి సమితి సంచలన పిలుపు

హలాల్ మాంసం, అజాన్ సమయంలో లౌడ్ స్పీకర్ వాడకంలపై నిషేదం తర్వాత కర్ణాటకలో ముస్లింలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకోనున్నారు.

Karnataka: పండ్ల వ్యాపారంపై హిందూ జన జాగృతి సమితి సంచలన పిలుపు

Karnataka

Updated On : April 6, 2022 / 7:42 PM IST

Karnataka: హలాల్ మాంసం, అజాన్ సమయంలో లౌడ్ స్పీకర్ వాడకంలపై నిషేదం తర్వాత కర్ణాటకలో ముస్లింలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకోనున్నారు. పండ్ల వ్యాపారంలో ముస్లిం వ్యాపారులు చూపిస్తున్న నియంతృత్వ పోకడను అడ్డుకుందామని పిలుపునిచ్చింది హిందూ జన జాగృతి సమితి.

కర్ణాటకలోని ఈ సమితి కోఆర్డినేటర్ చంద్ర మోజర్ ట్విట్టర్ వేదికగా ‘హిందువులంతా హిందూ దుకాణదారుల వద్దనే పండ్లను కొనుగోలు చేయాలని, చాలా వరకూ పండ్ల వ్యాపారాలు ముస్లింలే చేస్తున్నార’ని పేర్కొన్నారు.

‘పండ్ల వ్యాపారంలో ముస్లింలే మోనోపలీగా వ్యవహరిస్తున్నారు. కొందరు పండ్లపై, బ్రెడ్ పై అమ్మే ముందు ఉమ్మి వేస్తున్నారు. ఈ ముస్లిం వ్యాపారస్థులు స్పిట్టింగ్ జిహాద్ చేస్తున్నారు. హిందువులంతా పండ్ల వ్యాపారంలో ముస్లిం వ్యాపారస్థుల నియంతృత్వాన్ని అడ్డుకోవాలి. కేవలం హిందువులు మాత్రమే పండ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Read Also: కర్ణాటకలో కొత్త వివాదం.. ముదిరిన ఆలయాల్లో ముస్లిం వ్యాపారాల బహిష్కరణ

హిందూ రైట్ వింగ్ లీడర్ ప్రశాంత్ సంబార్గీ తన ఆలోచనలను పంచుకుంటూ.. పండ్ల వ్యాపారం నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలంటూ పిలుపునిచ్చారు.

హిందూ రైతులు శ్రమించి పండిస్తుంటే, ముస్లిం దుకాణదారులు లాభాలు చూస్తున్నారు. బిజినెస్ సైకిల్ మీద ఆల్రెడీ రీసెర్చ్ చేశాం. హిందూ రైతు పడుతున్న కష్టానికి కనికరం చూపడం లేదు. ఈ మధ్యవర్తిత్వాన్ని తొలగించాలనే ప్రచారం చేస్తున్నాం’ అని ప్రశాంత్ సంబార్గి వ్యాఖ్యానించారు. అలా చేస్తే ఎక్కువ లాభాలు చవిచూస్తారని సూచిస్తున్నారు ప్రశాంత్.