దేశద్రోహం కేసులో బీదర్‌లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను వారం రోజుల్లో నాలుగుసార్లు ప్రశ్నించారు కర్ణాటక పోలీసులు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారంటూ స్కూల్ యాజమాన్యం, స్కూల్ హెడ్ టీచర్,ఓ విద్యార్థి తల్లిపై గత గురువారం(జనవరి-30,2020)కర్ణాటక పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నాటకాన్ని రూపొందించడంలో తల్లి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారని, నాటకాన్నితమ పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించడానికి పాఠశాల యాజమాన్యం అనుమతించిందని పోలీసులు ఆరోపించారు. పిల్లలు సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని దూషిస్తూ మాట్లాడాడని ఆరోపిస్తూ ఓ హిందూ కార్యకర్త ఇచ్చిన కంప్లెయింట్ మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
సోమవారం(ఫిబ్రవరి-3,2020) నాలుగోసారి సాధారణ దుస్తుల్లో నాలుగోసారి షాహీన్ స్కూల్ కి వెళ్లిన పోలీసులు విద్యార్థులను మరోసారి ఇంటారాగేట్ చేశారు. నలుగురు పోలీసులు..ఇద్దరు మహిళా శిశు సంక్షేమ కమిటీ (CWC) సభ్యులతో కలిసి సోమవారం ఉదయం 10.30 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. బోధన మరియు బోధనేతర సిబ్బందిని ప్రశ్నించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ బసవేశ్వర హీరా ఆ బృందంతో చేరి ఏడుగురు విద్యార్థులను గ్రిల్ చేయడం ప్రారంభించారు.
సోమవారం ప్రశ్నించిన కొంతమంది విద్యార్థులు నాటకంలో భాగం కాలేదు. రెండు గంటల పాటు విద్యార్థులను ప్రశ్నించడం జరిగింది. మునుపటి విచారణలలో అడిగిన ప్రశ్నలనే దర్యాప్తు అధికారులు పునరావృతం చేసినట్లు తెలిసింది. మీకు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు, నిర్దిష్ట డైలాగులు ఎవరు నేర్పించారు. రిహార్సల్ ఎక్కడ జరిగింది అంటూ విద్యార్థులను ప్రశ్నించారు.
అయితే ఆ ప్రదర్శనలో ప్రధానమంత్రి మోడీని అవమానపర్చే వ్యాఖ్యలు ఏమీ చేయలేదని,సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీలపై దేశంలోని ముస్లింల గురించి ముస్లింల ఆందోళనల గురించి విద్యార్థులను సున్నితం చేయడానికి చేసిన ఓ ఎక్సర్ సైజ్ మాత్రమే అది అని స్కూల్ యాజమాన్యం చేబుతోంది. కేవలం ఓ హిందూ కార్యకర్త ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా పోలీసులు ఈ చర్య చేపట్టారని అంటున్నారు. 9 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలను పోలీసులు ఎందుకు పదేపదే మానసిక హింసకు గురి చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదని షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సీఈవో తౌసెఫ్ మడికేరి అన్నారు. పిల్లలపై వేధింపులు దీర్ఘకాలంలో వారిని ప్రభావితం చేస్తాయని, ఈ విషయం చెప్పినా పోలీసులకు అర్థం కావడం లేద తౌసెఫ్ అన్నారు.
ఇవన్నీ పక్కనపెడితే ఈ కేసు దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే కాకుండా, పిల్లలతో పోలీసులు వ్యవహరించిన తీరు అసహ్యంగా ఉంది. పిల్లలను, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని పిల్లలను విచారించేటప్పుడు అనుసరించే సాధారణ పద్ధతులను ఉల్లంఘించారని పలువురు అంటున్నారు.
దేశద్రోహం చట్టం దుర్వినియోగం
దేశద్రోహ చట్టాల వాడకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు దశాబ్దాలుగా జారీ చేసిన పదేపదే హెచ్చరికలకు కర్ణాటక పోలీసులు పట్టించుకోలేదు. గత శుక్రవారం కూడా, “దేశద్రోహం మరియు దేశ వ్యతిరేకత” వంటి పదాలను వదులుగా ఉపయోగించడంపై కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అనేక సుప్రీంకోర్టు తీర్పులు…ఎప్పుడైతే ఒక చర్య ప్రజల ఐక్యత చెడగొట్టేందుకు దారితీసినప్పుడు మాత్రమే దేశద్రోహం యొక్క తీవ్రమైన అభియోగాన్ని అమలు చేయవచ్చని స్పష్టం చేశాయి. ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదా దాని వ్యవస్థలకు వ్యతిరేకంగా బలమైన భాషను ఉపయోగించడం దేశద్రోహంగా భావించలేమని తెలిపాయి. కానీ కర్ణాటక పోలీసులు చేసిన పని ఇదే.
నాటకంలోని కొన్ని భాగాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్తు కొట్టిన తరువాత, నరేంద్ర మోడీని చెప్పులతో కొట్టాలని నాటకంలో ఒక పిల్లవాడు ఒక లైన్ మాట్లాడినట్లు ఆరోపణ. అయితే అనేక మీడియా నివేదికలు ఈ వాదనను తప్పుబట్టాయి. ఒకరి పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పత్రాలను కోరిన ఎవరినైనా చప్పల్స్‌తో కొట్టబడాలని పిల్లవాడు ఒక సాధారణ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇది ఏ విధంగానైనా దేశద్రోహ భావోద్వేగాలను రేకెత్తించదు. ఎలాంటి హింస జరగలేదు.
అది అటుంచితే పోలీసులు.. టీచర్,ఓ తల్లి నాటకాన్ని ప్రదర్శించడం ద్వారా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందువులందరూ చట్టానికి మద్దతు ఇస్తున్నారని, ముస్లింలందరూ దీనిని వ్యతిరేకిస్తున్నారనే దోషపూరిత ఊహపై ఇది ఆధారపడి ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక వర్గాల నుండి ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.
పిల్లలను ప్రశ్నించడం
ఆదివారం బీదర్ పోలీసులు పాఠశాల పిల్లలను మూడుసార్లు ప్రశ్నించారు. ఇది చట్టంలో అనుమతి లేని ఒక రకమైన బెదిరింపు. కుటుంబ న్యాయ నిపుణులు సుధా రామలింగం ప్రకారం…ఒక నేరాన్ని పరిష్కరించడంలో సహాయపడగలదై ఉంటే పిల్లలను ప్రశ్నించే హక్కు పోలీసులకు ఉన్నప్పటికీ, కొన్ని ప్రక్రియలను అనుసరించాల్సి ఉంది. ఉదాహరణకు… ఆదర్శంగా, పిల్లలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రశ్నించవలసి ఉంటుందని ఆమె అన్నారు. ఈ కేసులో… దేశద్రోహ చట్టాన్ని స్పష్టంగా దుర్వినియోగం చేసే కేసులో పిల్లలు తమ తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను ఫ్రేమ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. పోలీసులు చేస్తున్నది నిర్లక్ష్యంగా ఉందని ఆమె అన్నారు.
ప్రపంచమంతటా, పిల్లలను ప్రశ్నించడం సున్నితమైన అంశం. ఉదాహరణకు, మహారాష్ట్ర పోలీసు హ్యాండ్‌బుక్, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ బిడ్డనైనా వారి ఇంట్లో మాత్రమే ప్రశ్నించవలసి ఉంటుందని స్పష్టం చేస్తుంది. బీదర్ పోలీసులు మాత్రం పిల్లలను వారి పాఠశాలనే వారిని ప్రశ్నించడానికి ఎంచుకున్నారు.
ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 118 ప్రకారం…ఒక వ్యక్తిని సాక్షిగా ట్రీట్ చేయడానికి హేతుబద్ధమైన సమాధానాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అతడు ప్రశ్నలను మరియు దాని చిక్కులను అర్థం చేసుకోవడానికి సమర్థుడై ఉండాలి. బీదర్ పోలీసులు ప్రశ్నించిన పిల్లలలో తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఉన్నారు. ఇటువంటి బెదిరింపులు భావోద్వేగ భయాందోళనలకు దారి తీస్తాయని సుధా రామలింగం అన్నారు.