Mp Sakshi Maharaj
MP Sakshi Maharaj : వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి తనదైన శైలిలో హిందువులకు పిలుపునిచ్చారు. జిహాదీలు దాడి చేస్తే ఎదిరించడానికి హిందువులు విల్లు బాణాలతో రెడీగా ఉండాలి అని పిలుపునిచ్చారు. అంతేకాదు తలపై టోపీలు, చేతిలో కర్రలతో ఉన్న ఓ సమూహం ఎవరిమీదనో దాడికి వెళుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను ఆదివారం (ఏప్రిల్ 24,2022) తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు.
Also read : BJP MLA: నాకు ఓటు వేయనివారిది ముస్లింల రక్తమే.. -బీజేపీ ఎమ్మెల్యే
‘‘ఈ మూక (గుంపు) మీ వీధికి, మీ ఇంటిపైకి దాడి చేయటానికి వస్తే వారిని ఎదుర్కోవటానికి హిందువులంతా రెడీగా ఉండాలని దానికి సంబంధించి బాణాలు లాంటి ఆయుధాలతోపాటు గాజు సీసాలు వస్తే రక్షించుకోవడానికి మీకేదైనా మార్గం ఉందా? లేకపోతే ఏర్పాటు చేసుకోవాలి. మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు రారు.మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి..మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ సాటి హిందువులను కాపాడాలి అంటూ సూచించారు..
Also read : Muslim Sculptors : ముస్లిం శిల్పులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
మిమ్మల్ని రక్షించటానికి పోలీసులు రారు..ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడో దాక్కుంటారు. జిహాద్ ముగిసి, మూక వెళ్లిపోయిన తర్వాతే పోలీసులు వస్తారు..అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. అటువంటి అతిథుల’ కోసం రెండు బాక్సుల (కేసులు గాజు సీసాలు) కూల్‌డ్రింక్ సీసాలను, విల్లులు, బాణాలను ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి’’ అని పోస్టులో రాసుకొచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎంపీ చివరిలో ‘జైశ్రీరామ్’ అంటూ ముగించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయటమే కాకుండా ఎంపీ సాక్షి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ తన ఫేసుబుక్ పోస్టు చేశాను అని అంగీకరించారు. తన వ్యాక్యలను సమర్థించుకున్నారు.