BJP MLA: నాకు ఓటు వేయనివారిది ముస్లింల రక్తమే.. -బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దశలవారీగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

BJP MLA: నాకు ఓటు వేయనివారిది ముస్లింల రక్తమే.. -బీజేపీ ఎమ్మెల్యే

Mla

BJP MLA: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దశలవారీగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, గతంలో కంటే ఈసారి మాత్రం నేతలు కాంట్రవర్శీలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

ఈ వివాదాస్పద ప్రకటనల పరంపర కొనసాగుతోండగా.. తమ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలుచుకోవాలనే తపనతో వివిధ పార్టీల నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సిద్ధార్థనగర్‌లోని దుమారియాగంజ్ స్థానం నుంచి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి, మళ్లీ పోటీ చేస్తున్న అభ్యర్థి రాఘవేంద్ర సింగ్ వివాదాస్పద ప్రకటన చేశారు. రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ, ‘ఎవరైనా ముస్లీం నాకు ఓటు వేస్తారా? అలాగే మన హిందువులు అంతా ఏకమై అవతలివారితో జాగ్రత్తగా ఉండాలి.

ఈ గ్రామంలోని హిందువులెవరైనా వేరేవారికి ఓటు వేస్తే, వారిలో ముస్లిం రక్తం ప్రవహిస్తుందనే అర్థం చేసుకోండి.” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా సింగ్ మాటలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

నిజానికి, రాఘవేంద్ర సింగ్ వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇది మొదటి కేసు కాదు, అతను ఇంతకుముందు ఇలాంటి వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇస్తునే ఉన్నాడు. దుమారియాగంజ్‌లో మార్చి 3న ఆరో దశలో పోలింగ్ జరగనుండగా, మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.