Kerala : బీజేపీ నేత హత్య.. ఖండించిన కేంద్ర మంత్రి మురళీధరన్

ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూప్ పని అయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kerala (2)

Kerala BJP leader Murder : కేరళలో రాజకీయహత్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత 10 గంటల్లోనే ఇద్దరు దారుణ హత్యలకు గురయ్యారు. ఎస్​డీపీఐ (SDPI) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజీత్ శ్రీనివాసన్ లను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. హత్యా ఘటనలను సీఎం పినరయి విజయన్​ ఖండించారు. దీనిపై కేంద్ర మంత్రి వి. మురళీధరన్ స్పందించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజీత్ శ్రీనివాసన్ హత్యను ఆయన ఖండించారు. ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూప్ పని అయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read Moreశ్యామ్ సింగ రాయ్ మూవీ టీం గ్రీన్ ఇండియా ఛాలెంజ్

కేరళలో బీజేపీ నేతల హత్యలు కొత్తేమికాదని…పాలక్కాడ్ లో బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యాడని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇస్లామిక్ టెర్రరిస్టులతో రాష్ట్ర ప్రభుత్వం మృదువైన వైఖరి కనబరుస్తోందని, ఇది హింసకు పాల్పడే వారిని మరింత ప్రోత్సాహించినట్లేనని కేంద్ర మంత్రి మురళీధరన్ వ్యాఖ్యానించారు.

Read More : Pushpa : అసలు మజా పార్ట్ 2లో ఉంది : సుకుమార్

ఎస్​డీపీఐ (SDPI) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ ను 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక RSS హస్తం ఉందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆరోపించింది. పార్టీ కార్యాలయం నుంచి షాన్ బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో కారుతో ఢీ కొట్టారు దుండగులు. కింద పడిపోయిన షాన్ ను తీవ్రంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా…చికిత్స పొందుతూ షాన్ మృతి చెందారు. షాన్ చనిపోయిన తరువాత 12 గంటల్లోనే ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజీత్ శ్రీనివాస్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం ఉదయం రంజీత్ శ్రీనివాస్ ఇంట్లోకి చొరబడి దారుణంగా చంపేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 144 సెక్షన్, ఆంక్షలను విధించారు పోలీసులు.