Kerala CM : అమెరికాకు కేరళ సీఎం..ఎందుకంటే..

కేరళ సీఎం పినరయి విజయన్ ఈనెల 15న అమెరికా వెళ్తున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ కోసమే విజయన్ అమెరికా వెళ్తున్నట్లు గురువారం కేరళ ప్రభుత్వం తెలిపింది. పినరయి విజయన్ తో పాటు ఆయన భార్య కమల

Kerala CM :  కేరళ సీఎం పినరయి విజయన్ ఈనెల 15న అమెరికా వెళ్తున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ కోసమే విజయన్ అమెరికా వెళ్తున్నట్లు గురువారం కేరళ ప్రభుత్వం తెలిపింది. పినరయి విజయన్ తో పాటు ఆయన భార్య కమల, వ్యక్తిగత సహాయకుడు వీఎమ్ సునీష్‌‌ల యూఎస్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

యూఎస్ లోని మిన్నెసోట‌ రాష్ట్రంలోని రోచెస్టర్ సిటీలోని మయో క్లినిక్‌లో విజయన్ వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 15 నుంచి 29 వరకూ విజయన్ అక్కడే ఉంటారని తెలిపింది. సీఎం వైద్య పరీక్షలకయ్యే ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. పినరయి విజయన్ 2018లో కూడా మయో క్లినిక్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ ఫైలింగ్ సిస్టం కారణంతో తన తరఫు బాధ్యతలను మంత్రివర్గ సహచరులెవరికీ ఆయన ఇవ్వలేదు.

అమెరికా నుంచే సంబంధిత ఫైల్స్ ను విజయన్ పరిశీలించేవారు. ఆ సమయంలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి సీపీ జయరాజన్ కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఇప్పుడు మరోసారి సీఎం అమెరికా పర్యటనకు వెళ్తున్నందున తన మంత్రివర్గ సహచరులెవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా, కేబినెట్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారనేది చూడాల్సి ఉంది.

ALSO READ 4th Covid Shot : ఫోర్త్ డోస్ అవసరమవచ్చు..మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు