4th Covid Shot : ఫోర్త్ డోస్ అవసరమవచ్చు..మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల భారీ పెరుగుదలకు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కారణమని నిపుణులు అభిప్రాయపడున్నారు. ఒమిక్రాన్ టెన్షన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత

4th Covid Shot : ఫోర్త్ డోస్ అవసరమవచ్చు..మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు

Vaccine

Moderna CEO : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల భారీ పెరుగుదలకు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కారణమని నిపుణులు అభిప్రాయపడున్నారు. ఒమిక్రాన్ టెన్షన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత స్పీడప్ చేశాయి దేశాలు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు కోవిడ్ బూస్టర్ డోసును కూడా ప్రజలకు అందించే ఏర్పాట్లను ముమ్మరం చేశాయి దేశాలు. భారత్ లో కూడా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తోపాటు 60 ఏళ్లు పైబడి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోస్ పంపిణీ చేయనున్నట్లు ప్రధాని మోదీ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక,ఇజ్రాయెల్ అయితే 60 ఏళ్లు పైబడిన వారికి, వైద్య సిబ్బందికి కరోనా టీకా నాలుగో డోసు ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. ఫైజర్, బయెఎన్‌టెక్ సంస్థలు రూపొందించిన టీకాను రెండో బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు గతవారమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది.

అయితే కోవిడ్ వ్యాక్సిన్ ఫోర్డ్ డోస్ ను అతి త్వరలోనే అన్ని దేశాలు అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా సీఈవో చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. గురువారం గోల్డ్ మాన్ సాచ్స్ అమెరికాలో నిర్వహించిన హెల్త్ కేర్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మొడెర్నా సీఈవో స్టెఫానే బన్సెల్..కాలక్రమేణా కోవిడ్ కు వ్యతిరేకంగా బూస్టర్ డోసుల సామర్థ్యం తగ్గిపోయే అవకాశముందని,ప్రజలు తమ ప్రొటెక్షన్ కోసం కోవిడ్ ఫోర్డ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చునని  తెలిపారు. గతేడాది బూస్టర్‌ డోస్ లను పొందిన వ్యక్తులు చలికాలం అంతా తగినంత రక్షణను కలిగి ఉంటారు.

ప్రజలు చలి నుండి తప్పించుకోవడానికి ఇంటి లోపల గుమిగూడినప్పుడు కొత్త ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయని,ఈ నేపథ్యంలో గతేడాది బూస్టర్‌ డోస్ లను పొందిన వ్యక్తులు చలికాలం అంతా తగినంత రక్షణను కలిగి ఉంటారని స్టెఫానే బన్సెల్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి,రెండవ డోస్ ల మాదిరిగానే బూస్టర్ డోస్ సామర్థం కూడా కొన్ని నెలల్లో తగ్గిపోవచ్చునని గురువారం ఓ ఇంటర్వ్యూలో మోడెర్నా సీఈవో చెప్పారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ కట్టడి కోసం తమ కంపెనీ ఇప్పటికే ఓ ట్వీక్డ్ వ్యాక్సిన్ పై పనిచేస్తుందని స్టెఫానే బన్సెల్ తెలిపారు.

ALSO READ Corona Guidelines: మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు!