Kerala Gold
Gold Smuggling : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం.. అటు తిరిగి, ఇటు తిరిగి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడవకముందే ఆయన డాలర్ స్మగ్లింగ్ కేసు ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసు విషయంలో పినరయికు కస్టమ్స్ అధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. ఆయనతో పాటు మాజీ స్పీకర్ శ్రీరామకృష్ణన్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న స్వప్న సురేష్ స్టేట్‌మెంట్ ఆధారంగా కస్టమ్స్ అధికారులు పినరయికు షాక్ ఇచ్చారు.
Read More : Porn case: బెయిల్ ఇవ్వొద్దు.. నీరవ్ మోదీలా దేశం విడిచి వెళ్లిపోవచ్చు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్ జమాల్ ద్వారా యూఏఈకి పినరయి, శ్రీరామకృష్ణన్‌లు డాలర్లు పంపినట్లుగా స్వప్న సురేష్ కస్టమ్స్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై కేరళ హైకోర్టులో పినరయి సర్కార్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతుండగా.. తాజాగా ఈ కేసులో స్వయంగా సీఎం పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తుండడం అధికార LDFకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లైంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం.. కేరళ రాజకీయాల్లో భూకంపాన్ని పుట్టిస్తోంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు మొదలుపెట్టింది.
Read More : Y.S.Viveka Murder: వివేకా హత్యకేసు.. హైడ్రామా మధ్య ఆయుధాల స్వాధీనం!
దేశంలోని మరే సీఎంపై కూడా ఇంతవరకు గోల్డ్, డాలర్ స్మగ్లింగ్‌లకు సంబంధించి ఇన్ని ఆరోపణలు రాలేదని కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. సీఎంగా పినరయి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణ సమయంలో ఈ డాలర్ స్మగ్లింగ్ కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ కు చెందిన ఫైనాన్స్ హెడ్ 1,90,000 అమెరికన్ డాలర్లను ఒమన్ లోని మస్కట్ కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సురేశ్, సరితను అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు వారిని విచారించగా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్లు అధికారులు వెల్లడించారు.