Porn case: బెయిల్ ఇవ్వొద్దు.. నీరవ్ మోదీలా దేశం విడిచి వెళ్లిపోవచ్చు

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా బెయిల్‌పై విడుదలైతే నీరవ్ మోదీలాగే దేశం విడిచి వెళ్లిపోతాడని ముంబై పోలీసులు అభిప్రాయపడ్డారు.

Porn case: బెయిల్ ఇవ్వొద్దు.. నీరవ్ మోదీలా దేశం విడిచి వెళ్లిపోవచ్చు

Kundra

Raj Kundra: అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా బెయిల్‌పై విడుదలైతే నీరవ్ మోదీలాగే దేశం విడిచి వెళ్లిపోతాడని ముంబై పోలీసులు అభిప్రాయపడ్డారు. బెయిల్ దరఖాస్తుపై విచారణలో ముంబై పోలీసులు కుంద్రాకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపినట్లు అవుతుందని కోర్టుకు చెప్పారు. బెయిల్‌పై విడుదలైతే కుంద్రా మళ్లీ నేరం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ కేసును ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు.

కుంద్రాను గత నెలలో అరెస్టు చేయగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కుంద్రా కోర్టులో దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తు ప్రకారం, ఛార్జిషీట్‌లో పేరున్న వారు ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నారు. తనను మాత్రం జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. అయితే, కౌంటర్‌గా పోలీసులు ఇచ్చిన సమాధానంలో.. నేరం తీవ్రమైన స్వభావం కలిగి ఉందని, అన్నీ వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయా? అనే విషయాన్ని తనిఖీ చేస్తున్నామని చెప్పారు.

బెయిల్ మంజూరైతే, కుంద్రా మళ్లీ అదే నేరానికి పాల్పడవచ్చు. ఇది మన సంస్కృతిని ప్రభావితం చేస్తుంది. సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపినట్లు అవుతుంది. కుంద్రా ఈ కేసులో నిందితుడు మరియు ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రదీప్ బక్షి బంధువు కూడా. కనుక కుంద్రా బయటకు వస్తే, ఇద్దరూ టచ్‌లో ఉండి, బక్షిని కేసు నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ పౌరుడు కూడా అయిన కుంద్రా తప్పించుకునే అవకాశం ఉందని, నీరవ్ మోదీలా పారిపోవచ్చునని ముంబై పోలీసులు వివరించారు.

చిత్ర పరిశ్రమతో సంబంధాలు ఎక్కువగా ఉండడంతో బెయిల్‌పై కుంద్రా విడుదలైతే, వీడియోలు భారతదేశానికి వెలుపలకు వెళ్లి అప్‌లోడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు పోలీసులు. ఈ కేసులో బాధితులు ఆర్థికంగా బలహీనమైన మహిళలు. నిందితులు బయటకు వస్తే, మహిళలు ఖచ్చితమైన సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారని పోలీసులు కోర్టుకు తెలిపారు.