Ex Teacher Held In Malappuram For Molesting Over 60 Students
Kerala : పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదేదో ఒకరు ఇద్దరిపై కాదు ఏకంగా 60మంది ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు. మాస్టారనే భయంతో బయటకు చెప్పుకోలేక పాపం ఆ చిన్నారులు లోలోపలే కుమిలిపోయేవారు. అలా ఆ కీచక ఉపాధ్యాయుడు కీచక క్రీడ ఏడాది రెండేళ్లు కాదు 30 ఏళ్లు సాగింది. 30 ఏళ్లుగా స్కూల్లో చదువుకునే విద్యార్ధులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు తన కీచక క్రీడలతోనే రిటైర్ అయ్యాడు. అప్పుడు నోరు విప్పారు పాపం విద్యార్ధినులు. తమపై జరిగిన ఘోరాల గురించి చెప్పుకొచ్చారు. దీంతో సదరు కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కేరళలో జరిగింది.
కేరళలో ఓ కీచక మాజీ ఉపాధ్యాయుడు విద్యార్ధినులపై చేసిన ఘోరాలు వెలుగులోకొచ్చాయి.30 ఏళ్ల సర్వీసులో ఆ ఉపాధ్యాయుడు 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం బయటకు వచ్చింది.కేరళలోని మలప్పురం మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా చేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు.
ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసాడని శశికుమార్ పై పోలీసు కేసు నమోదైంది. 50 మంది విద్యార్ధినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడుసార్లు కౌన్సిలర్ గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నాడు. దాంతో అతడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న మాజీ విద్యార్థిని ఒకరు అతడి అరాచకాలను బయటపెట్టింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో శశికుమార్ పరారయ్యాడు. అతడిని వారం రోజులుగా గాలించి ఎట్టకేలకు పట్టుకుని శుక్రవారం (మే 13,2022)అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తరఫున లోపాలు ఉన్నాయేమో చూడాలని కోరారు. ఈ పరిణామాలతో శివకుమార్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. మున్సిపల్ కౌన్సిలర్ పదవికి అతడు రాజీనామా చేశాడు.