అక్షరాస్యత విషయంలో దేశంలోనే ముందున్న రాష్ట్రం కేరళ.. ఈ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించే ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ప్రాజెక్టును డిసెంబర్ వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
రూ. 1,548 కోట్ల ఈ ప్రాజెక్టును 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొందడం “పౌరుల ప్రాథమిక హక్క” అని ముఖ్యమంత్రి చెప్పారు. మరే రాష్ట్రంలోనూ పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వడం లేదని ఆయన తెలిపారు.
ఈ పథకానికి ‘కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్’ (కె ఫోన్)గా పేరు పెట్టారు. ఈ పథకాన్ని కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లిమిటెడ్, కేరళ స్టేట్ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆద్వర్యంలో జరగనుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి బోర్డు అందించనుంది. ఈ పథకం ద్వారా పేదలకు ఉచితంగా, ఇతరులకు వేర్వేరు ధరల్లో ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు ఆయన చెప్పారు.
ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ 2016 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ ప్రకటించిన ప్రధాన ప్రకటనలలో ఒకటి. కేరళలో ఎక్కువ మంది పెట్టుబడిదారులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓవర్ టైం పని చేస్తున్నట్లు తెలిసింది. ఇతర పెద్ద ప్రాజెక్టులు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, స్టార్టప్ డొమైన్లలో ప్రధాన అవకాశాలున్న ఐటి రంగంలో కేరళ ఈ నిర్ణయంతో దూసుకెళ్తుందని, కె-ఫోన్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ అవుతుందని సిఎం చెప్పారు.