Kerala Lockdown : కేరళలో కరోనా విలయం.. ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్..!

కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు బయట పడుతున్నాయి. గత 24 గంటల్లో 50వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Kerala Lockdown : కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తోంది. మొదటి వేవ్, రెండో వేవ్‌‌కు మించి మూడో వేవ్‌లో విరుచుకుపడుతోంది. ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు బయట పడుతున్నాయి. గత 24 గంటల్లో 50వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 20న (గురువారం) కేరళలో అత్యధిక స్థాయిలో రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ టెస్టుల్లో పాజిటివిటీ రేటు 40 శాతం దాటింది. కోవిడ్ టెస్టుల సంఖ్య పెరిగాయి. రాష్ట్రంలో 46,387 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,357 కరోనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 40.21 శాతంగా నమోదైంది. ఇక రాష్ట్రంలోని తిరువనంతపురంలో అత్యధికంగా 9,720 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో ఎర్నాకులం ఉంది. కోజికోడ్, త్రిసూర్, కొట్టాయం కొల్లంలో వరుసగా 3,002, 4,016, 3,627, 3,091 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,99,041 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇందులో కేవలం 3 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. రాష్ట్రంలో మొత్తం 32 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరో 309 మరణాలు కొత్తగా చేరాయి. దాంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 51,501కి చేరుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 172 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఉన్నారు. మరో 43,176 మంది కాంటాక్టుల ద్వారా వైరస్ బారిన పడ్డారు. 2,654 కేసులలో వైరస్ ఎలా వ్యాపించింది అనేది స్పష్టత లేదు. మొత్తం 385 మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత వారంతో పోలిస్తే.. కోవిడ్ కేసుల సంఖ్య 204 శాతం పెరిగింది. చికిత్స పొందేవారి సంఖ్య 201 శాతం పెరిగింది. ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య 70 శాతం పెరిగింది. ఫీల్డ్ ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య 126 శాతం పెరిగింది. ఇక ఐసీయులో ఉన్న వారి సంఖ్య 48 శాతం పెరిగింది. వెంటిలేటర్ సపోర్ట్‌లో ఉన్న వారి సంఖ్య 14 శాతానికి పెరిగింది. ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్న రోగుల సంఖ్య 64 శాతం పెరిగింది.

ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్ :
రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో.. కేరళ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వచ్చే రెండు ఆదివారాలు (జనవరి 23, 30) పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణాలపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అవసరమైన సేవలు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆదివారం, మాల్స్ థియేటర్లు మూతపడనున్నాయి. అన్ని తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. 10, 12వ తరగతి విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలల్లో తరగతులు ఉండవు.

ప్రతి జిల్లా యంత్రాంగం కరోనా కేసుల సంఖ్య ఆధారంగా కొత్త ఆంక్షలపై నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. థియేటర్లు, బార్లపై పరిమితులను సంబంధిత జిల్లా కలెక్టర్లు నిర్ణయించవచ్చు. తిరువనంతపురం, వాయనాడ్, పాలక్కాడ్, ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో బహిరంగ సభలపై నిషేధం, భారీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఎర్నాకుళం, అలప్పుజ కొల్లంలో బహిరంగ సభలు 50 మందితో మాత్రమే నిర్వహించేందుకు అనుమతి ఉంది.

Read Also : Pradeep Raj : కరోనాతో ప్రముఖ డైరెక్టర్ మృతి

ట్రెండింగ్ వార్తలు