పెళ్లి కాని ప్రసాద్‌ ఫ్రస్ట్రేషన్..పక్కింటోడి షాపుని జేసీబీతో కూల్చేసిన యువకుడు

  • Publish Date - October 28, 2020 / 04:16 PM IST

Kerala : పెళ్లికాని ప్రసాదులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. 25 ఏళ్లు దాటినా..30 ఏళ్లు నిండుతున్నా పెళ్లికాని ఓ యువకుడు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాడు. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఎవరో కావాలనే చెడగొడుతున్నాడని అనుమానపడ్డాడు. అలా ఓ రోజున ఏకంగా పక్కింటికి వ్యక్తికి ఉన్న ఓ షాపును కూలగొట్టేశాడు. జేసీబీ వేసుకెళ్లి మరీ కూలగొట్టేసిన ఘటన కేరళలో జరిగింది.


కేరళలోని కన్నూర్ జిల్లాకి చెందిన అల్బిన్‌ అనే యువకుడికి 30ఏళ్లు వచ్చాయి. కానీ పెళ్లి కావట్లేదు. పెళ్లి కోసం అతని తల్లిదండ్రులు ఎన్నో పెళ్లి సంబంధాలు చూశారు. కానీ ఒక్కటీ కుదరలేదు. ఏవో కారణాలతో పెళ్లి కుదరకరపోవటంతో తనకు వచ్చిన పెళ్లి సంబంధాలను ఎవరో కావాలనే చెడగొడుతున్నారని అల్బిన్ అనుమాన పడ్డాడు. అనుమానం పెనుభూతమైంది. తన పొరుగున ఉండే సోజీ అనే వ్యక్తిపై ఆగ్రహం పెంచుకున్నాడు.


ఎలాగైనా తగిన శాస్తి చేయాలనుకున్నాడు. అలా ఓ రోజున ఏకంగా జేసీబీని తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న అతని షాపు వద్ద నిలిపి తాను ఈ షాపుని మొత్తం కూలగొట్టేశాడు. పూర్తిగా నేలమట్టం చేశాడు. అంతటితో అతని ఫ్రస్ట్రేషన్ తగ్గలేదు. పేద్ద హీరోలాగా అదంతా సినిమా స్టైల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


షాపును నేలమట్టం చేశాక అల్బిన్ చెప్పిన సమాధానం విన్నవాంతా అవాక్కయ్యారు. ‘‘ఆ షాపు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని.. ఇక్కడ జనాలకు ఎవరికీ షాపులో జరిగే పనులు నచ్చడం లేదని..పంచాయతీ అధికారులకు చెప్పినా ఎటువంటి ఫలితం లేకపోయిందనీ..అందుకే షాపుని కూలగొట్టానని సమర్థించుకున్నాడు.


ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి రావటంతో అక్రమంగా షాపును కూలగొట్టినందుకు పెళ్లి కాని ప్రసాద్‌ అల్బిన్ ‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సదరు షాపు యజమాని మాట్లాడుతూ తనకు అల్బిన్ కు ఎటువంటి విభేధాలు లేవని అతను ఎందుకు అలా చేశాడో తనకు తెలియదని ఆవేదన వ్యక్తంచేశాడు.


తనకు జీవనాధారమైన షాపుని కూల్చేనందుకు తనకు న్యాయంచేయాలని నష్టపరిహారం ఇప్పించాలను కోరాడు. దీంతో పోలీసులు అల్బిన్ పైకేసు నమోదు చేసి స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.