Brave Man: తగలబడుతున్న లారీని సురక్షిత ప్రాంతానికి తరలించిన వ్యక్తి

జనావాసాల మధ్య నుంచి వెళుతున్న ఒక లారీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. సాహసంతో ముందుకు వచ్చిన ఒక వ్యక్తి .. తగలబడుతున్న ఆ లారీని.. అమాంతం సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు

Brave Man: “ఇరుకైన రోడ్డు, చుట్టూ ఇల్లు, ప్రజలు.. జనావాసాల మధ్య నుంచి వెళుతున్న ఒక లారీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. సాహసంతో ముందుకు వచ్చిన ఒక వ్యక్తి .. తగలబడుతున్న ఆ లారీని.. అమాంతం సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఆపద సమయంలో ధైర్యసాహసాలను ప్రదర్శించి.. పెను ప్రమాదాన్ని తప్పించిన ఆ వ్యక్తిని ఇప్పుడు అందరు ప్రశంసిస్తున్నారు. జనవరి 30న కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలుకూ వివరాలు ఇలా ఉన్నాయి.

Also read: Chinese brutality: కళ్ళకు గంతలు కట్టి, కరెంటు షాక్ ఇచ్చారు: అరుణాచల్ యువకుడు

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోడెంచెరి పట్టణంలో జనవరి 30న ఒక లారీ ఎండు గడ్డి లోడుతో పట్టణంలోని ఇరుకు రోడ్డుగుండా వెళ్తుంది. పైనున్న కరెంటు తీగలు తగిలి.. ఎండుగడ్డిలో మంటలు చెలరేగాయి. అది గమనించని లారీ డ్రైవర్ ముందుకు వెళ్తుండగా.. లారీలో చెలరేగిన మంటలను చూసి స్థానికులు కేకలు వేశారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో.. లారీ డ్రైవర్ సైతం భయపడి.. లారీ దిగి పరుగు తీశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న షాజీ వర్గీస్ అనే వ్యక్తి.. దైర్యంగా లారీలోకి ఎక్కి..లారీని వేగంగా నడుపుకుంటూ.. సమీపంలోని ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అనంతరం లారీని గజిబిజిగా తిప్పుతూ.. తగలబడుతున్న ఎండు గడ్డి మూటలు కిందపడేలా చేశాడు. అనంతరం షాజీ వర్గీస్ లారీని నిలిపివేయగా.. స్థానికులు, పోలీసులు వచ్చి నీళ్లు చల్లారు.

Also Read: Vijayawada Police: పీఆర్సీ ర్యాలీ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

చాకచక్యంగా వ్యవహరించిన షాజీ వర్గీస్ పెనుప్రమాదాన్ని తప్పించడంతో పాటు లారీని సురక్షితంగా ఉంచాడు. ఇక ఈఘటనపై స్థానిక అగ్నిమాపక అధికారి స్పందిస్తూ..షాజీ వర్గీస్ సాహసాన్ని అభినందించారు. ఘటనా స్థలం నుంచి ఫైర్ స్టేషన్ 20 కిలోమీటర్ల దూరంలో ఉందని..మంటల్లో చిక్కుకున్న లారీ జనావాసాల మధ్యే ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని అధికారులు వెల్లడించారు. స్వతహాగా భారీ వాహన డ్రైవర్ అయిన షాజీ వర్గీస్..గతంలోనూ పలుమార్లు ఇటువంటి దైర్యసాహాసాలు ప్రదర్శించాడు.

ట్రెండింగ్ వార్తలు