Delhi Women Pick Pockets Arrested
Kerala: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు చెందిన ముగ్గురు కార్తకర్తలను పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్థానిక లీడర్‌ను హత్య చేసిన కేసులో అరెస్టు చేశారు. పలక్కాడ్‌లో పీఎఫ్ఐ నాయకుడి హత్యకేసు గురించి ఏడీజీపీ విజయ్ శాఖరే ఇలా మాట్లాడారు.
గతేడాది నవంబర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఎస్ సంజిత్ హత్యకు ప్రతీకారంగా పీఎఫ్‌ఐ నేత సుబైర్ హత్య జరిగిందని ఏడీజీపీ విజయ్ సాఖారే పాలక్కాడ్‌లో మీడియాకు స్పష్టం చేశారు. అరెస్టు అయిన వారిని రమేష్, ఆరుముఖన్, శరవణన్‌గా గుర్తించిన సాఖరే, “సంజిత్‌తో రమేష్ సన్నిహితుడు కావడంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు” అని వెల్లడించారు.
పాలక్కాడ్‌లోని పీఎఫ్‌ఐ స్థానిక ఏరియా అధ్యక్షుడిగా ఉన్న సుబైర్‌ను హత్య చేసేందుకు ముగ్గురు సభ్యుల గ్రూప్ ఒకే నెలలో రెండుసార్లు విఫలయత్నాలు చేసిందని పోలీసులు తెలిపారు. “హత్యకు ముందు, సంజిత్ తన సన్నిహితుడు రమేష్‌తో తనకు ఏదైనా జరిగితే దానికి PFI నాయకుడు సుబైర్ ను అంతమొందించే బాధ్యత తీసుకోవాలని చెప్పాడు” అని సఖారే వెల్లడించారు.
Read Also: ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాం: రాహుల్ గాంధీ