Youngest Mayor Arya Rajendran To Marry Mla Sachin Dev
youngest mayor arya rajendran to marry mla sachin dev : కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్‌కి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆర్య రాజేంద్రన్..ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను వివాహం చేసుకోనున్నారు. దేశంలోనే అత్యంత చిన్నవయస్కురాలైన మేయర్ ఆర్య రాజేంద్రన్, కేరళ అసెంబ్లీలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే సచిన్ దేవ్ లు వివాహ బంధంతోఒక్కటి కానున్నారు. తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ దేశంలోనే చిన్నవయస్కురాలైన మేయర్‌గా గుర్తింపుపొందారు. కేరళ అసెంబ్లీలో చిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా.. సచిన్ దేవ్ ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే సచిన్ దేవ్ అధికారంగా ప్రకటించారు. తమ పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయని..నెల రోజుల తర్వాత మా వివాహం జరగనుందని తెలిపారు. సచిన్ దేవ్ బాలుస్సెరి శాసనసభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో.. సినీ నటుడు ధర్మాజన్ బొల్గట్టీపై సచిన్ దేవ్ విజయం సాధించారు. ఆర్య, సచిన్ ఇరువురూ.. బాలసంఘం, ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యులుగా ఉన్నప్పటి నుంచే స్నేహితులుగా ఉన్నారు. వారి స్నేహం ప్రేమగా మారి వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.
Also read : Covid in Kerala: కేరళలో కుదుటపడుతున్న పరిస్థితులు, కరోనా ఆంక్షలు సడలింపు
డిసెంబర్ 2020లో..కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్‌కు ఆర్య రాజేంద్రన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆమె భారతదేశంలోనే అతి పిన్న వయససు కలిగిన మేయర్‌గా గుర్తింపు పొందారు. ఐదు నెలల తర్వాత.. KM సచిన్ దేవ్ ప్రస్తుత కేరళ అసెంబ్లీలో అత్యంత పిన్న వయసు గల ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు సీపీఐ(ఎం)కి చెందిన ఆర్య, సచిన్ దేవ్‌లు పెళ్లి చేసుకోబోతున్నారు.
తమ వివాహం గురించి ఈ జంట మాట్లాడుతూ..‘మేమిద్దరం ఒకే విధమైన రాజకీయ భావజాలానికి చెందినవాళ్లం..మేము బాలల సంఘంలోను..తరువాత SFIలో కలిసి పనిచేశామని తెలిపారు. మేమిద్దరం మంచి స్నేహితులం…ఒకరిపై మరొకరికి చక్కటి నమ్మకం ఉంది.దీంతో స్నేహితులుగా ఉన్న మేము వివాహం చేసుకోవాలని అనుకున్నాం. అదే విషయం మా కుటుంబాలకు చెప్పాము. ఇరుకుటుంబాల వారు అంగీకరించారని బుధవారం (ఫిబ్రవరి 16,2022)తెలిపారు. విలేకరులతో అన్నారు.
Also read : Kerala Labourer Model: ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా 60 ఏళ్ల రోజువారీ కూలి..
SFI అనేది CPI(M) విద్యార్థి విభాగం అనే విషయం తెలిసిందే. పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ కాలేదని ఆర్య తెలిపారు. ఇరు కుటుంబాలతో పాటు పార్టీ మధ్య సంప్రదింపుల అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.ఆర్య వామపక్షాల బాలల సంఘం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షుగా పనిచేశారు.
Also read : Kerala CM Viral tweet : మలయాళంలో దుబాయ్ ప్రధాని ట్వీట్..అరబిక్ లో స్పందించిన కేరళ సీఎం
తరువాత ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పలు పోరాటాల్లో పాల్గొన్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ 100 వార్డుల్లో 52 స్థానాల్లో విజయం సాధించడంతో ఆమె కేవలం 21 ఏళ్ల వయసులో తిరువనంతపురం కార్పొరేషన్‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు.