జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి ఘటనలో ముసుగు ధరించిన వ్యక్తులకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ముసుగులు ధరించి వచ్చిన దుండగుల ఆచూకీ వెల్లడవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి ఘటనలో ముసుగు ధరించిన వ్యక్తులకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ముసుగులు ధరించి వచ్చిన దుండగుల ఆచూకీ వెల్లడవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే పోలీసులు ఈ కేసును ఛేదించే అవకాశముంది. మరోవైపు విద్యార్థులపై దాడి ఘటన తర్వాత విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టి, వారికి తగిన భరోసాను కల్పించాలని కేంద్రం వర్శిటీ పాలక వర్గాన్ని ఆదేశించింది. క్యాంపస్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. .
50మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు,కర్రలు,హాకీ స్టిక్స్ చేతబట్టుకుని ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దేశ్ కీ గద్దారో కో, గోలీ మారో సాలా కో అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ లేడీస్ హాస్టల్స్ కి కూడా వెళ్లి విద్యార్థినులపై దుండగులు దాడిచేశారు. యావత్తు దేశం జేఎన్ యూ ఘటనను ఖండిస్తోంది.
ఈ దాడికి పాల్పడింది ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీకి సంబంధించినవాళ్లేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులపై దుర్మార్గపు దాడి కేవలం క్యాంపస్ హింసకు సంబంధించిన కేసు కాదు. జెఎన్‌యు విద్యార్థులపై గుంపు హింస ముందే చెప్పిన చరిత్ర. ఈ దాడిని యూనివర్శిటీ, దాని సిబ్బంది, అధ్యాపకులను రోజువారీగా భూతవైద్యులుగా చూపిన ఫలితంగా చెప్పవచ్చు.
దాడిలో గాయపడిన బాధితులను కలిసేందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అక్కడికి వెళ్లారు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. గాయాలకు గురైన ఐషే ఘోష్‌తో పాటుగా మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ కూడా అక్కడ సమావేశమయ్యారు.
సాయంత్రం 7గంటల 30నిమిషాల ప్రాంతంలో దీపికా అక్కడకు వచ్చి ఓ పదిహేను నిమిషాలు విద్యార్థులను కలిసి మాట్లాడింది. వచ్చిన కాసేపటికే బీజేపీ నుంచి దీపికా పదుకొనె సినిమాలు బాయ్‌కాట్ చేయాలంటూ ఆదేశాలు అందాయట. బాలీవుడ్ ఏ కేటగిరీలో ఉన్న పెద్ద స్టార్స్ అంతా మౌనంగా ఉన్నప్పటికీ దీపికా తీసుకున్న నిర్ణయానికి అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తుంది.