అయ్యో.. పెళ్లిరోజు ఎంజాయ్ చేద్దామంటే ఇలా జరిగిందేంటి..? ఫోన్ ఆన్ చేయగానే పోలీసులొచ్చి షాకిచ్చారు.. అసలేం జరిగిందంటే..

కోల్‌కతాకు చెందిన ఓ న్యాయవాది పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. భర్త ప్రేమతో ఇచ్చిన ఫోన్‌ను భార్య ఆన్ చేసింది.

wedding day

Gujarat: పెళ్లిరోజున భార్యకు సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు భర్త ప్లాన్ చేశాడు. దీంతో రూ.49వేలతో ఓ ఫోన్ కొనుగోలు చేశాడు. సాయంత్రం ఇంటికెళ్లి భార్యకు ప్రేమతో ఫోన్ అందించాడు. భర్త ప్రేమగా ఖరీదైన కొత్త ఫోన్ కొనివ్వడంతో భార్య ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. పెళ్లిరోజు ఎంతో సంతోషంగా గడుపుదామని అనుకున్నారు. అయితే, భర్త ఇచ్చిన కొత్త ఫోన్ ను భార్య ఆన్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే వాళ్లింటికి పోలీసులు వచ్చి.. భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని విచారించే క్రమంలో అసలు విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: అర్ధరాత్రి ముంచుకొచ్చిన ఉపద్రవం.. 67మంది ప్రాణాలను కాపాడిన కుక్క.. అసలేం జరిగిందంటే?

కోల్‌కతాకు చెందిన ఓ న్యాయవాది పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. భర్త ప్రేమతో ఇచ్చిన ఫోన్ ను భార్య ఆన్ చేసింది. ఫోన్‌ను ఆన్ చేసి మురిసిపోతుండగానే కొద్ది నిమిషాల్లో గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన పోలీసులు వాళ్ల ఇంటికొచ్చి తలుపుతట్టారు. దంపతులు డోర్ తీసి చూడగా.. పోలీసులు ఉన్నారు. కంగారుతో ఏం జరిగింది.. మీరెందుకు మా ఇంటికి వచ్చారు అంటూ న్యాయవాది ప్రశ్నించాడు. ఆ ఫోన్‌తో సైబర్ నేరాలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పడంతో భార్యాభర్తలకు ఏం అర్ధంకాలేదు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో వాళ్లు భయంతో వణికిపోయారు.

పోలీసులు వారిని కూర్చోబెట్టి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎప్పుడు మీ చేతికొచ్చింది..? అని ఆరా తీశారు. తాము ఇవాళే మొబైల్ షాపు నుంచి రూ. 49వేలు చెల్లించి ఫోన్ కొనుగోలు చేశామని చెప్పారు. తాము ఎలాంటి నేరం చేయలేదని, మేము కొనుగోలు చేసింది కొత్త ఫోన్ అని చెప్పారు.

పోలీసులు సూచనల మేరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మొబైల్ షాపుపై రైడ్ చేశారు. ఆ షాపులో డాక్యుమెంట్స్ తనిఖీ చేయగా అన్నీ సరిగానే ఉండటంతో పోలీసులు షాపు యాజమానిని ప్రశ్నించారు. షాపు యాజమాని ఇచ్చిన సమాచారంతో మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ ను అందుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పెళ్లిరోజు అని రూ.49వేలు పెట్టి కొత్త‌ఫోన్ కొన్నందుకు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నేరం చేయకపోయినా పెళ్లిరోజున తాము పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.